మేడ్చల్ కలెక్టరేట్, అక్టోబర్ 4 : పార్టీలో ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఉంటుందని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి పేర్కొన్నారు. దమ్మాయిగూడ మున్సిపల్ టీఆర్ఎస్ పార్టీ నూతన కమిటీని మంత్రి తన నివాసంలో సోమవారం ప్రకటించారు. నూతన కమిటీ సభ్యులకు నియమాక పత్రాలు అందజేసి సత్కరించారు.
మున్సిపాలిటీ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా కౌకుట్ల తిరుపతి రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా సంపనబోలు హరిగౌడ్ రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వర్కింగ్ ప్రెసిడెంట్గా వాస కిరణ్ కుమార్ గుప్తా, ఉపాధ్యక్షులుగా నరేశ్ గౌడ్, బాల్రెడ్డి, వీరేశ్, జనార్దన్ రెడ్డి, రంగయ్య, బాల్రెడ్డి, సంతోష్ గౌడ్, కనకయ్యలతో పాటు కమిటీ సభ్యులను నియమించారు. మహిళా అధ్యక్షురాలుగా రాజేశ్వరి, యూత్ అధ్యక్షుడిగా మణికంఠ ముదిరాజ్, ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా బోడ నరేశ్, ఎస్టీ సెల్ అధ్యక్షుడిగా నాను నాయక్, మైనార్టీ సెల్ అధ్యక్షుడిగా మహ్మద్ షఖీల్, టీఆర్ఎస్వీ అధ్యక్షుడిగా మల్లారెడ్డిని ఎన్నుకున్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ వసుపతి ప్రణీత శ్రీకాంత్ గౌడ్, వైస్ చైర్మన్ నరేందర్ రెడ్డి, కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.