మేడ్చల్, అక్టోబర్ 3: నిరుపేదల సంక్షేమమే ధ్యేయంగా టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తున్నదని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ మండలంలోని పలువురు వైద్య సహాయ నిమిత్తం సీఎం సహాయనిధికి దరఖాస్తు చేసుకున్నారు. ఈ మేరకు రాజబొల్లారం గ్రామానికి చెందిన మహలక్ష్మీకి రూ. 20 వేలు, గిరిభాస్కర్కు రూ. 70 వేలు చెక్కులు మంజూరయ్యాయి. ఈ చెక్కులను మంత్రి తన నివాసంలో లబ్ధిదారులకు ఆదివారం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో నిరుపేదల బాగుకోసం సంక్షేమ పథకాలను అందించి సీఎం కేసీఆర్ ఆదుకుంటున్నారని తెలిపారు. ప్రభుత్వం అందించే పథకాలను ప్రజలు సద్వినియోగ పర్చుకుని లబ్ధి పొందాలన్నారు.కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ రాములు, టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి సుదర్శన్, నాయకులు మహేశ్, లక్ష్మీనారాయణ, వెంకట్, అనీల్ పాల్గొన్నారు.