మేడ్చల్, సెప్టెంబర్ 30 : సీఎం సహాయనిధి పేదలకు వరమని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ పథకం ద్వారా మేడ్చల్ మండలంలోని గౌడవెల్లి గ్రామానికి చెందిన లావణ్యకు రూ.33,500, గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీకి చెందిన రాజుకు రూ.లక్ష, చంద్రయ్య చారికి రూ.60 వేలు, వెంకట్‌రెడ్డికి రూ.లక్ష చెక్కును మంత్రి గురువారం తన నివాసంలో అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేదల సంక్షేమానికి సీఎం కేసీఆర్ కరోనా కష్టకాలంలో వెనుకడుగు వేయకుండా పథకాలను అమలు చేస్తూ ఆదుకుంటున్నారని అన్నారు. నిరుపేదల వైద్య సహాయం కోసం సీఎం సహయనిధి ద్వారా ఆర్థిక సహాయం చేస్తున్నారని చెప్పారు. ఇప్పటికే నియోజకవర్గంలో అనేక మందికి ఈ పథకం ద్వారా సాయం అందించగా వైద్య చికిత్స చేయించుకుని ఆరోగ్యవంతులుగా జీవనం గడుపుతున్నారని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని పథకాలను సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు అందించడం వల్ల ప్రతి ఇంటికి లబ్ధి చేకూరుతున్నదని అన్నారు. లబ్ధిదారులు పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పీఏసీఎస్ చైర్మన్ రణదీప్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దయానంద్‌యాదవ్, కౌన్సిలర్ జయపాల్‌రెడ్డి, నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, జగన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.