కీసర, సెప్టెంబర్ 29: టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే ప్రజాప్రతినిధులకు చక్కటి వేతనం, అంతకుమించిన గౌరవం దక్కుతున్నదని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, జడ్పీటీసీల గౌరవ వేతనాన్ని ప్రభుత్వం పెంచగా.. కీసరలోని ఔటర్ రింగ్‌రోడ్డులోని టోల్గేట్ వద్ద సీఎం కేసీఆర్ చిత్రపటానికి మంత్రి మల్లారెడ్డి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ప్రజాప్రతినిధులకు వేతనాలు పెంచిన ఘనత సీఎం కేసీఆర్‌దేనన్నారు. గ్రామాభివృద్ధిలో టీఆర్ఎస్ నేతలందరూ పాలుపంచుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ వెంకటేశ్, మండల పార్టీ అధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి నారాయణ, పీఏసీఎస్ చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు పెంటయ్య, సర్పంచ్‌లు మాధురివెంకటేశ్, మహేందర్‌రెడ్డి, పుట్ట రాజు, గోపాల్‌రెడ్డి, విమలనాగరాజు, ఆండాలుమల్లేశ్, ఎంపీటీసీ తటాకం నారాయణ, మండల కో-ఆప్షన్ సభ్యుడు బర్సాస్అలీ, నాయకులు పర్వత్‌రెడ్డి, సత్యనారాయణ, రమేశ్, మల్లారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, బాబుయాదవ్, బాల్‌రాజ్, మహేశ్వర్‌గౌడ్, బాలకృష్ణ, రమేశ్ గుప్త, విజయ్‌కుమార్, శ్రీధర్‌రెడ్డి, ఆంజనేయులు, శ్రీనివాస్, సుదర్శన్, ప్రవీణ్‌కుమార్ పాల్గొన్నారు.