ఘట్కేసర్,సెప్టెంబర్29: దేశానికి అన్నం పెట్టే రైతును రాజును చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. ఘట్కేసర్ రైతు సహకార సంఘంఅధ్యక్షుడు సింగిరెడ్డి రాంరెడ్డి అధ్యక్షతన బుధవారం శివారెడ్డిగూడలోని ఎస్వీఎం ఫంక్షన్ హాల్లో సర్వసభ్య సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో 1కోటి,25లక్షల ఎకరాల భూమికి సాగునీటిని అందించిన ఘనత దేశంలో సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు దేశంలోనే అతిపెద్ద లిప్టు ఇరిగేషన్ ప్రాజెక్టు అని మంత్రి పేర్కొన్నారు.రైతుకు పంట రుణాలతో పాటు, రైతుబంధు,ధాన్యం కొనుగోలు కేం ద్రాలను ఏర్పాటు చేశామన్నారు. రైతుల కోసం దేశంలో ఏ రాష్ట్రం లో లేని సంక్షేమ పథకాలు సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ హయాంలో రైతులు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొన్నారని అన్నారు.
రాష్ట్రంలో రైతు సొసైటీల అభివృద్ధికి సీఎం కేసీఆర్ పెద్ద పీట వేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే,టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మలిపెద్ది సుధీర్‌రెడ్డి అన్నారు.సొసైటీలను బలోపేతం చేసి రైతులను ఆర్థికంగా అభివృద్ధి చేయాడానికి కృషి చేస్తున్నారన్నారు. అనంతరం జడ్పీ చైర్మన్ శరత్‌చంద్రారెడ్డి మాట్లాడారు. కార్యక్రమంలో జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు నందారెడ్డి,పీర్జాదిగూడ మేయర్ జక్క వెంకట్‌రెడ్డి,ఎంపీపీ ఏనుగు సుదర్శన్‌రెడ్డి, ఘట్కేసర్ చైర్పర్సన్ ఎం.పావని జంగయ్య యాదవ్ సొసైటీ ఉపాధ్యక్షుడు అనంతరెడ్డి,ఎండీ.ప్రమోద్‌కుమార్,మేనేజర్ రత్న జయప్రకాశ్,హైదరాబాద్ మార్కెట్ కమిటీ సభ్యుడు కె.కొండల్‌రెడ్డి,మండల రైతు సంఘం అధ్యక్షుడు అంజిరెడ్డి,టీఆర్ఎస్ మున్సిపాలిటీ అధ్యక్షుడు బండారి శ్రీనివాస్ గౌడ్, పోచారం మున్సిపాలిటీ వైస్‌చైర్మన్ రెడ్డ్యానాయక్,డైరెక్టర్లు,కౌన్సిలర్లు,ఎంపీటీసీలు,సర్పంచ్‌లు,టీఆర్ఎస్ నాయకులు, అధికారలు,రైతులు పాల్గొన్నారు.
సీఎంఆర్ఎఫ్ పేదలకు వరంలా మారిందని మంత్రి మల్లారెడ్డి అన్నారు. ఘట్కేసర్కు చెందిన వసంత కుమార్ అనారోగ్యంతో దవాఖానలో చికిత్స పొందిన అనంతరం సీఎంఆర్ఎఫ్కు దరఖాస్తు చేసుకోగా ప్రభుత్వ మంజూరైన రూ.28,000 చెక్కును మంత్రి మల్లారెడ్డి బుధవారం ఆయన అందజేశారు. కార్యక్రమంలో ఘట్కేసర్ చైర్పర్సన్ ఎం.పావని జంగయ్య యాదవ్, వైస్ చైర్మన్ మాధవ రెడ్డి, కౌన్సిలర్ మల్లేశ్,టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి రాధాకృష్ణ, బీసీ సెల్ అధ్యక్షుడు హరిశంకర్ పాల్గొన్నారు.