ఘట్కేసర్/మేడ్చల్ /మేడ్చల్ రూరల్ /శామీర్‌పేట/ కీసర, సెప్టెంబర్ 29: అన్నివర్గాలకు న్యాయం చేయడం సీఎం కేసీఆర్‌తోనే సాధ్యమని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. ఎంపీపీ, జడ్పీటీసీ, ఎంపీటీసీల గౌరవ వేతనాలు 30శాతం పెంచిన సందర్భంగా బుధ వారం మేడ్చల్ మండలం మునీరాబాద్, శామీర్‌పేట మండల కేంద్రంలో, కీసర రింగ్‌రోడ్డు టోల్గేట్ వద్ద, ఘట్కేసర్లో మంత్రి స్థానిక శ్రేణలుతో కలిసి సీఎం కేసీఆర్ చిత్ర పటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ నిబద్ధతతో పని చేసే వారిని గుర్తిస్తారన్నారు. ప్రజలు, ప్రజాప్రతినిధులు, ఉద్యోగులకు కేసీఆర్ న్యాయం చేస్తున్నారన్నారు. అందులో భాగంగానే గ్రామా ల్లో ప్రజలు, ప్రభుత్వానికి వారిధిగా ఉంటూ అభివృద్ధికి పాటుపడుతున్న జడ్పీటీసీ, ఎంపీటీసీల సేవలను కేసీఆర్ గుర్తించి, గౌరవ వేతనం పెంచారన్నారు. సంక్షేమ పథకాలు క్షేత్ర స్థాయికి తీసుకెళ్లడంలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు క్రియాశీలపాత్ర పోషిస్తున్నారని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఇలాంటి గుర్తింపు ఉండేదా అని మంత్రి ప్రశ్నించారు.
ప్రభుత్వం గుర్తింపు లభించిన నేపథ్యంలో ఎంపీటీటీసీలు, జడ్పీటీసీలు మరింత ఉత్సాహం తో పని చేసి, ప్రజలకు న్యాయం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఘట్కేసర్ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ మలిపెద్ది శరత్‌చంద్రారెడ్డి,ఘట్కేసర్ చైర్పర్సన్ ఎం.పావని జంగయ్య యాదవ్, ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి, పోచారం చైర్మన్ కొండల్‌రెడ్డి, టీఆర్ఎస్ మున్సిపాలిటీల అధ్యక్షులు మందాడి సురేందర్‌రెడ్డి, బండారి శ్రీనివాస్‌గౌడ్, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. మునీరాబాద్‌లో ఎంపీపీ పద్మాజగన్ రెడ్డి, జడ్పీటీసీ శైలజావిజయానందారెడ్డి, ఎంపీటీసీలు నీరుడి రఘు, ప్రకాశ్, అనుపమ, మండల కో ఆప్షన్ సభ్యురాలు రుక్సానా బేగం, జిల్లా సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు విజయానందారెడ్డి, సర్పంచ్‌లు గణేశ్, బాబు యాదవ్, మంగ్యానాయక్, ఉప సర్పంచ్ నర్సింగ్‌రావు, మాజీ సర్పంచ్‌లు మద్దుల శ్రీనివాస్ రెడ్డి, జగన్ రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దయానంద్, నాయకులు భాగ్యారెడ్డి, హరత్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, యూనిస్పాష, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.
శామీర్‌పేటలో జరిగిన కార్యక్రమం లో ఎంపీపీలు ఎల్లూభాయిబాబు, హారికమురళీగౌడ్, జడ్పీటీసీ అనితలాలయ్య, వైస్ ఎంపీపీ సుజాత తిరుపతిరెడ్డి, రైతుబంధు అధ్యక్షుడు కంటం కృష్ణారెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు సుదర్శన్, మల్లేశ్‌గౌడ్, సర్పంచ్‌లు గుర్క కుమార్‌యాదవ్, మోహన్‌రెడ్డి, భాస్కర్, గీతమహేందర్, లతరవీందర్, జామ్ రవి, నర్సింహారెడ్డి, జ్యోతిబల్రాంగౌడ్, విష్ణువర్దన్‌రెడ్డి, హరిమోహన్‌రెడ్డి, ఎంపీటీసీలు అశోక్‌రెడ్డి, ఇందిరా, ఉపసర్పంచ్ సాయిబాబు, రమేశ్‌యాదవ్, వార్డు సభ్యులు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. కీసరలో జరిగిన కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ వెంకటేశ్, మండల పార్టీ అధ్యక్షులు సుధాకర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి నారాయణ, పీఏసీఎస్ చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, సర్పంచ్ల సంఘం అధ్యక్షులు పెంటయ్య, సర్పంచ్‌లు మాధురి వెంకటేశ్, మహేందర్‌రెడ్డి, రాజుముదిరాజ్, గోపాల్‌రెడ్డి, విమలనాగరాజు, ఆండాలుమల్లేశ్, ఎంపీటీసీ నారాయణ, మండల కోఆప్షన్ సభ్యులు బర్సాస్ఆలీ, నాయకులు పర్వత్‌రెడ్డి, సత్యనారాయణ, రమేశ్, మల్లారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, బాబూయాదవ్, బాల్‌రాజ్, మహేశ్వర్‌గౌడ్, బాలకృష్ణ, రమేశ్‌గుప్త, విజయ్‌కుమార్, శ్రీధర్‌రెడ్డి,ఆంజనేయులు, శ్రీనివాస్, సుదర్శన్, ప్రవీణ్‌కుమార్ పాల్గొన్నారు.