మేడ్చల్, సెప్టెంబర్17(నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్రాభివృద్ధి సీఎం కేసీఆర్‌తోనే సాధ్యమని ప్రజలందరూ గుర్తించారని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మంత్రి క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు మంత్రి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ ఇతర పార్టీలపై ప్రజల్లో విశ్వాసం పోయిందని, ప్రజల సూచనల మేరకు నాయకులు టీఆర్ఎస్లో చేరుతున్నారని పేర్కొన్నారు. మేడ్చల్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ మండల కమిటీల ప్రక్రియ పూర్తయిందని మంత్రి పేర్కొన్నారు.
గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ 14వ వార్డు కౌన్సిలర్ హేమంత్‌రెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు నరసింహా రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి దత్తుగౌడ్, మేడ్చల్ మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు ప్రకాశ్‌రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సంజీవరెడ్డి, వార్డు సభ్యులు సుధాకర్ ముదిరాజ్, లక్ష్మీ భూపాల్‌రెడ్డి వారి అనుచరులతో కలిసి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్లో చేరారు. టీఆర్ఎస్ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, సుదర్శన్, మల్లేశ్‌గౌడ్ పాల్గొన్నారు.
మేడ్చల్ : సీఎం సహాయనిధి పేదలకు వరమని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ మండలంలోని పూడూర్ గ్రామానికి చెందిన సత్తిబాబు వైద్య సహాయ నిమిత్తం సీఎం సహాయనిధికి దరఖాస్తు చేసుకున్నారు. ఈ మేరకు మంజూరైన చెక్కును క్యాంప్ కార్యాలయంలో లబ్ధిదారుడికి మంత్రి శుక్రవారం అందజేశారు. గ్రామ ఎంపీటీసీ రఘు, పూడూర్ పీఏసీఎస్ చైర్మన్ సుధాకర్‌రెడ్డి, నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, జగన్‌రెడ్డి పాల్గొన్నారు.
కీసర : చీర్యాల్ గ్రామానికి చెందిన బి.ఆంజనేయులు వైద్య సహాయ నిమిత్తం సీఎం సహాయనిధికి దరఖాస్తు చేసుకోగా మంజూరైన చెక్కును లబ్ధిదారుడికి జడ్పీ వైస్ చైర్మన్ బెస్త వెంకటేశ్, ఎంపీపీ ఇందిర శుక్రవారం అందజేశారు. సర్పంచ్ ధర్మేందర్, గ్రామ కమిటీ అధ్యక్షుడు విజయ్‌కుమార్‌యాదవ్, పంచాయతీ సభ్యులు పాల్గొన్నారు.