శామీర్‌పేట/బండ్లగూడ, సెప్టెంబర్ 8 : గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం చేయడంతో పాటు కులవృత్తులపై ఆధారపడిన వారి కుటుంబాల్లో వెలుగులు నింపడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తున్నదని రాష్ట్ర పశు సంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. శామీర్‌పేట పెద్ద చెరువులో మంత్రి మల్లారెడ్డితో కలిసి బుధవారం చేపపిల్లల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ అనుక్షణం పాటుపడుతున్నారని, ఎన్నో నీటి ప్రాజెక్టులను చేపట్టి తెలంగాణలో 365 రోజులు నీళ్లు ఉండేలా ప్రణాళిక రూపొందించారని వివరించారు. ఎక్కడ నీళ్లుంటే అక్కడ చేపలు ఉండాలని, 100 శాతం సబ్సిడీపై చేప పిల్లలు పంపిణీ చేస్తున్నామన్నారు. మేడ్చల్ జిల్లాలో కోటి చేప పిల్లల పంపిణీతోపాటు ఉచితంగా సీడ్ ఇస్తున్నామన్నారు. గొల్లకురుమలకు గొర్లు పంపిణీ చేస్తున్నామని తెలిపారు.
అనంతరం మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన హరితహారంతో సమృద్ధిగా వర్షాలు కురుస్తున్నాయన్నారు. వ్యవసాయం, చేపల పెంపకంతో పాటు అన్ని రంగాలకు మంచి రోజులు రాబోతున్నాయని అన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ సెక్రటరీ అనిత రాజేందర్, కమిషనర్ లచ్చిరాం బుక్య, అడిషనల్ డైరెక్టర్ శంకర్ రాథోడ్, జీఎంవీ.శ్రీనివాస్, జడ్పీ వైస్ చైర్మన్ వెంకటేశం, రైతుబంధు జిల్లా అధ్యక్షుడు నందారెడ్డి, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ మధుకర్‌రెడ్డి, ఎంపీపీ ఎల్లూబాయిబాబు, జడ్పీటీసీ అనితాలాలయ్య, వైస్ ఎంపీపీ సుజాత తిరుపతిరెడ్డి, జిల్లా మత్య్సశాఖ మాజీ చైర్మన్ వెంకటేశం, నర్సింహారెడ్డి, మద్దుల శ్రీనివాస్‌రెడ్డి, డీడీ లక్ష్మీనారాయణ, చెరువు చైర్మన్ యాదగిరి, ప్రధాన కార్యదర్శి రఘు, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సుదర్శన్, యూత్ అధ్యక్షుడు నర్సింహారెడ్డి, ఎంపీటీసీలు, స ర్పంచ్‌లు, ఉపసర్పంచ్లు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.