పీర్జాదిగూడ , శామీర్‌పేట, మేడ్చల్ రూరల్, సెప్టెంబర్ 7: సీఎం సహాయనిధి నిరుపేదలను ఆపదలో ఆదుకుంటున్నదని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. మంగళవారం మంత్రి తన నివాసంలో పీర్జాదిగూడ 5వ డివిజన్ రామ్నగర్కాలనీకి చెందిన రామాయణం గోపాలకృష్ణ, మూడుచింతలపల్లికి చెందిన బంగారు వెంకటేశ్ వైద్య సహాయ నిమిత్తం సీఎం సహాయనిధికి దరఖాస్తు చేసుకోగా చెక్కులు మంజూరయ్యాయి. ఈ చెక్కులను మంత్రి లబ్ధిదారులకు మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ సీఎం సహాయనిధి నిరుపేదలకు వరమన్నారు. పేదల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నదని తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్ బొడిగే స్వాతి కృష్ణగౌడ్, కో ఆప్షన్ సభ్యులు జగదీశ్వర్‌రెడ్డి, సర్పంచులు రవి, విష్ణువర్ధన్‌రెడ్డి, ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ నాగరాజుగుప్తా, మురళీగౌడ్ పాల్గొన్నారు.
గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీకి చెందిన బూసిరెడ్డి చంద్రకాంత్ రెడ్డి, మండల శంకరయ్యగౌడ్, నాగజ్యోతి, పల్లపు బాల నర్సింహ వైద్య సహాయ నిమిత్తం సీఎం సహాయనిధికి దరఖాస్తు చేసుకోగా చెక్కులు మంజూరయ్యాయి. ఈ చెక్కులను మంగళవారం గుండ్లపోచంపల్లిలో టీఆర్ఎస్ నేత మద్దుల శ్రీనివాస్ రెడ్డి, కౌన్సిలర్లు జైపాల్ రెడ్డి, బేరి బాలరాజ్ లబ్ధిదారులకు అందజేశారు. కార్యక్రమంలో గుండ్లపోచంపల్లి టీఆర్ఎస్ అధ్యక్షుడు సంజీవగౌడ్, ప్రధాన కార్యదర్శి కృష్ణారెడ్డి, నాయకులు జనార్దన్‌రెడ్డి, సత్తిరెడ్డి, రమేశ్, సందీప్‌రెడ్డి పాల్గొన్నారు.