Gurugram : గుర్గావ్ (హరియాణా) పట్టణంలో బుధవారం నడిరోడ్డుపై కిడ్నాప్ యత్నం జరిగింది. డెలివరీ బాయ్ గా పని చేస్తున్న ఒక వ్యక్తిని ఇద్దరు వ్యక్తులు కిడ్నాప్ చేసేందుకు యత్నించారు. అయితే, వెంటనే పోలీసులు అలర్ట్ అయి, నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. బుధవారం సాయంత్రం 5.30 గంటలకు, పెరిఫెరల్ రోడ్డులో ఈ ఘటన జరిగింది.
నిందితుడు జైవీర్, బాధిత వ్యక్తి స్నేహితులు. జైవీర వ్యాపారం చేసేవాడు. అతడు రెండేళ్లక్రితం ఒక ట్రక్కు అమ్మేసి, దాని ద్వారా వచ్చిన రూ.6.5 లక్షల డబ్బును తన కారులో దాచాడు. అయితే, ఆ డబ్బును ప్రస్తుతం కిడ్నాప్ నకు గురైన వ్యక్తి చోరీ చేశాడు. దీనిపై ఆరా తీయగా.. అతడు రూ.6.5 లక్షలు చోరీ చేసినట్లు ఒప్పుకొన్నాడు. తర్వాత డబ్బు తిరిగి ఇచ్చేస్తానని చెప్పగా, టైం ఇచ్చారు. కానీ, అప్పటినుంచి అతడు తప్పించుకుతిరుగుతున్నాడు. దీంతో అతడిదగ్గరి నుంచి డబ్బు ఎలాగైనా వసూలు చేయాలనే ఉద్దేశంతో జైవీర్, తన అసిస్టెంట్ అమన్ తో కలిసి అతడిని కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారు. రోడ్డుపై వెళ్తుండగా, కర్రలతో దాడి చేసి, తమ కారులో ఎక్కించుకున్నారు.
Two men, who allegedly kidnapped and assaulted a delivery partner following a financial dispute involving Rs 6.5 lakh, were arrested on Wednesday.
The suspects – Jaybir (26) and Aman (21) – told police that the kidnapping was a “planned attempt to recover money”.
Key accused… pic.twitter.com/ouQ3rhMgc5
— Hate Detector 🔍 (@HateDetectors) January 23, 2026
కానీ, అది చూసిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించగా.. ఎమర్జెన్సీ వెహికల్ రెస్పాన్స్ టీం అలర్ట్ అయింది. ఆ కారును పోలీసులు వెంబడించి పట్టుకున్నారు. బాధితుడిని రక్షించారు. కిడ్నాపర్లలో ఒకతను పారిపోయేందుకు యత్నించగా.. అతడిని కూడా వెంటాడి బంధించారు. నిందితులు ఇద్దరినీ అదుపులోకి తీసుకుని విచారించారు. కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆదేశాలకు అనుగుణంగా తదుపరి చర్యలు తీసుకుంటామని ఏఎస్ఐ సందీప్ కుమార్ తెలిపారు.