హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్( Congress ) ప్రభుత్వం కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడుతుందని బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకుడు నెమ్మాది శ్రావణ్‌కుమార్ ( Nemmadi Sravan Kumar ) ఆరోపించారు. ఇందులో భాగంగానే పంచాయతీ ఎన్నికల సమయంలో హరీష్‌రావుపై, నేడు మున్సిపల్ ఎన్నికల సమయంలో కేటీఆర్‌కు సిట్ నోటీసులని దుయ్యబట్టారు.
రేవంత్ రెడ్డి పాలనలో దౌర్భాగ్యమైన పరిస్థితి రాష్ట్రంలో నెలకొన్నాయని విమర్శించారు. ఆధారాలు లేని కేసులకు, కాలేశ్వరం ప్రాజెక్టు, ఫార్ములా ఈ-రేస్ లో నోటీస్ ఇచ్చి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని మండిపడ్డారు.పాలన గాలికి వదిలి సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి చేస్తున్న కుట్ర అని అన్నారు.
రాష్ట్రంలో యూరియా దొరకక రైతులు తండ్లాడుతుండగా సర్కారు సొమ్ముతో ముఖ్యమంత్రి జల్సాలు చేస్తున్నారని పేర్కొన్నారు. సంక్రాంతి పండుగ అయిపోయినా కూడా రైతుభరోసా ఊసే లేదని అన్నారు.ఫోన్ ట్యాపింగ్ కేసులో పసలేదని అత్యున్నత న్యాయస్థానాలు తేల్చి చెప్పినా, కాంగ్రెస్ ప్రభుత్వం నీచపు రాజకీయాలు చేస్తుందని మండిపడ్డారు.
రేవంత్ సర్కారు ఆడించినట్లు పోలీస్ యంత్రాంగం ఆడుతుండం విచారకరమని, ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ నేతలకు నోటీసులు ఇవ్వడం హాస్యాస్పదంగా ఉందని వివరించారు. రెండేళ్లుగా దర్యాప్తు బృందం కొండనుతవ్వి ఎలుకను కూడా పట్టలేదని అన్నారు. కేసులు విచారిస్తున్న అధికారులు మారుతున్నారని, ఆధారాలు మాత్రం చూపించడం లేదని వెల్లడించారు. కేటీఆర్‌కు సిట్ నోటీసులు ఇవ్వడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.