కీసర, సెప్టెంబర్ 6: డ్రోన్లతో విత్తనాల ను వెదజల్లి హరిత వనాలను మరింతగా విస్తరింపజేస్తున్నామని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ దత్తత తీసుకున్న కీసరగుట్ట అటవీ ప్రాంతంలో సోమవారం గుబ్బా చైర్మన్ నాగేందర్ ఆధ్వర్యంలో డ్రోన్లతో విత్తనాల ను వెదజల్లే కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. అనంతరం మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న హరితహారం కార్యక్రమంతో తెలంగాణ ఆకుపచ్చని రాష్ట్రంగా మారిందని తెలిపారు.
అన్ని ప్రాంతా ల్లో మొక్కలు పెంచడమే లక్ష్యంగా అత్యాధునిక టెక్నాలజీతో విత్తనాలు వెదజల్లే కార్యక్రమానికి శ్రీకా రం చుట్టడం అభినందనీయమని అన్నారు. ఇప్పటికే ఆమన్‌గల్, మెద క్, మేడ్చల్, కామారెడ్డి జిల్లాల్లో డ్రోన్ సాయం తో విత్తనాలను వెదజల్లి పూర్తిగా సక్సెస్ అయినట్లు పేర్కొన్నారు. త్వరలోనే మరో 10 జిల్లాల్లో ఈ ప్రాజెక్టును ముం దుకు తీసుకువెళ్లనున్నట్లు తెలిపారు. అయితే ఎంపీ సంతోష్ కుమార్ కీసర ఫారెస్టును దత్తత తీసుకుని రూ.3 కోట్ల వ్యయంతో అభివృద్ధి పరుస్తూ.. పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దుతున్నారని చెప్పారు.
ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ చీఫ్ కన్జర్వేటర్ అక్బర్, డీఎఫ్‌వో వెంకటేశ్వర్లు, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ బెస్త వెంకటేశ్, ఎంపీపీ మల్లారపు ఇందిరాలక్ష్మీనారాయణ, ఎంపీడీవో పద్మావతి, పీఏసీఎస్ చైర్మన్ రామిడి ప్రభాకర్‌రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు జలాల్పురం సుధాకర్‌రెడ్డి, సర్పంచ్‌లు ఆకిటి మహేందర్‌రెడ్డి, టీఆర్ఎస్ నేతలు నాయకపు వెంకటేశ్ ముదిరాజ్, సింగారం నారాయణ, వంగేటి పర్వత్‌రెడ్డి, పండుగ శశికాంత్, తదితరులు పాల్గొన్నారు.