శామీర్పేట, ఆగస్టు 31 : పారా వాలీబాల్ క్రీడాకారుడికి రాష్ట్ర కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి రూ.లక్ష ఆర్థిక సాయం అందించి తన ఉదారతను చాటుకున్నాడు. ఆసియా దేశాలతో కిష్ ఐలాండ్ ఐఆర్ ఇరాన్లో నవంబర్ 4 నుంచి 14 వరకు జరుగనున్న 2021 పారా వాలీబాల్ ఆసియా ఓషియానియా సిట్టింగ్ జోన్ చాంపియన్ షిప్-16 పోటీలకు తెలంగాణ రాష్ట్రం తరఫున దీరావత్ మహేశ్నాయక్ ఎంపికైన విషయం తెలిసిందే. అయితే క్రీడల్లో పాల్గొని రావడానికి దారిఖర్చులకు రూ.1.48 లక్షలు ఖర్చు అయ్యే అవకాశం ఉంది. దానిలో 50 శాతం డబ్బులు సెప్టెంబర్ 2వ తేదీ వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని సోమవారం రాష్ట్ర కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి దృష్టికి తీసుకెళ్లగా స్పందించిన మంత్రి వెంటనే రూ.లక్ష ఆర్థిక సాయం అందించారు. దీంతో క్రీడాకారుడు దీరావత్ మహేశ్నాయక్ మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గోపీనాయక్, డైరెక్టర్ బావుసింగ్, సర్వన్, తదితరులు పాల్గొన్నారు.