మేడ్చల్, ఆగస్టు 31 : ప్రజా సంక్షేమమే ధ్యేయంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తున్నదని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ మండలంలోని గౌడవెల్లి గ్రామానికి చెందిన దశరథకు సీఎం రిలీఫ్‌ఫండ్ కింద మంజూరైన రూ.50 వేల చెక్కును మంగళవారం మంత్రి తన క్యాంపు కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ పేదలకు సీఎం సహాయనిధి అందించి ఆదుకుంటున్నారన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ పద్మాజగన్‌రెడ్డి, సీఏసీఎస్ చైర్మన్ రణదీప్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాజు, పూడూర్ సర్పంచ్ బాబు, మాజీ సర్పంచ్ జగన్‌రెడ్డి, నాయకులు సుదర్శన్‌రెడ్డి, సంతోశ్బాను తదితరులు పాల్గొన్నారు.
శామీర్‌పేట, ఆగస్టు 31 : శామీర్‌పేట మండలం అలియాబాద్ గ్రామానికి చెందిన పడిగె రవి అనారోగ్యంతో నిమ్స్ దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. ఈ సందర్భంగా అతనికి సీఎం రిలీఫ్‌ఫండ్ కింద మంజూరైన రూ.2 లక్షల ఎల్వోసీని మంగళవారం మంత్రి చామకూర మల్లారెడ్డి లబ్ధిదారుకుడి కుటుంబానికి అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ గుర్క కుమార్‌యాదవ్, రైతుబంధు అధ్యక్షుడు కంటం కృష్ణారెడ్డి, విజయ్‌కుమార్, లబ్ధిదారుడి కుమారుడు శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.
పీర్జాదిగూడ, ఆగస్టు 31: సీఎం సహాయనిధి పేదలకు వరంలా మారిందని పీర్జాదిగూడ నగరపాలక సంస్థ 26వ డివిజన్ కార్పొరేటర్ పప్పుల రాజేశ్వరీఅంజిరెడ్డి అన్నారు. మంగళవారం స్థానిక వార్డు కార్యాలయంలో డివిజన్ పరిధికి చెందిన పావనికి సీఎం సహాయనిధి కింద మంజూరైన రూ.లక్ష 50 వేల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో పేదలను సీఎం కేసీఆర్ కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారన్నారు. కార్యక్రమంలో నాయకులు, వార్డు కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.