మేడ్చల్ కలెక్టరేట్,ఆగస్టు 30 : పేదల సంక్షేమం, అభివృద్ధి ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. నాగారం మున్సిపాలిటీకి చెందిన వీరన్నకు వైద్య సహాయ నిమిత్తం సీఎం సహాయనిధి నుంచి చెక్కు మంజూరైంది. ఈ చెక్కును మంత్రి సోమవారం లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. అలాగే నాగారం మున్సిపల్ కార్యాలయంలో ఎస్వీ నగర్‌కు చెందిన దీపికకు సీఎం సహాయనిధి నుంచి మంజూరైన చెక్కును చైర్మన్ కౌకుట్ల చంద్రారెడ్డి అందజేశారు. కార్యక్రమంలో మున్సిపాలిటీ టీఆర్ఎస్ అధ్యక్షుడు శ్రీధర్, వైస్ చైర్మన్ బి.మల్లేశ్, ఘట్కేసర్ ఎంపీపీ సుదర్శన్ రెడ్డి, కౌన్సిలర్ శ్రీనివాస్ గౌడ్, సుర్వి శ్రీనివాస్ గౌడ్, నాయకులు శ్రీనివాస్, కౌకుట్ల కృష్ణారెడ్డి, అన్నంరాజు సురేశ్ పాల్గొన్నారు.
మేడ్చల్ రూరల్ : గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధి… 1వ వార్డు సుతారిగూడకు చెందిన పెంటయ్యకు వైద్య సహాయ నిమిత్తం సీఎం సహాయనిధి నుంచి చెక్కు మంజూరైంది. ఈ చెక్కును సుతారిగూడలో మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మీశ్రీనివాస్ రెడ్డి సోమవారం లబ్ధిదారుడికి అందజేశారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ ప్రభాకర్, కౌన్సిలర్లు రజితావెంకటేశ్, వీణాసురేందర్‌గౌడ్, టీఆర్ఎస్ నాయకులు వెంకటేశ్, శ్రీనివాస్, పాండు, రమేశ్, నాగరాజు పాల్గొన్నారు.