శామీర్‌పేట, ఆగస్టు 29 : ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తున్నదని కార్మికశాఖ మంత్రి మలారెడ్డి అన్నారు. మూడుచింతల్‌పల్లి మండలం జగ్గంగూడ గ్రామానికి చెందిన కాశపాక లక్ష్మికి వైద్య సహాయం నిమిత్తం సీఎం సహాయనిధి నుంచి చెక్కు మంజూరైంది. ఈ చెక్కును మంత్రి తన నివాసంలో లబ్ధిదారులకు ఆదివారం అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ విష్ణువర్ధన్‌రెడ్డి, నాగరాజుగుప్తా, మురళీగౌడ్ పాల్గొన్నారు.
మేడ్చల్ రూరల్ : గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీకి చెందిన పలువురికి వైద్య సహాయం నిమిత్తం జోగోళ్ల భిక్షపతి , లక్ష్మి, ఉద్దెమర్రి కృష్ణకు సీఎం సహాయనిధి నుంచి చెక్కులు మంజూరయ్యాయి. ఈ చెక్కులను మున్సిపాలిటీ కార్యాలయంలో లబ్ధిదారులకు మున్సిపాలిటీ చైర్పర్సన్ మద్దుల లక్ష్మీశ్రీనివాస్ రెడ్డి ఆదివారం అందజేశారు. మాజీ సర్పంచ్ మద్దుల శ్రీనివాస్ రెడ్డి, కౌన్సిలర్లు జైపాల్ రెడ్డి, మల్లికార్జున్, బారాజు, మున్సిపాలిటీ టీఆర్ఎస్ అధ్యక్షుడు సంజీవగౌడ్, ప్రధాన కార్యదర్శి కృష్ణా రెడ్డి పాల్గొన్నారు.