ఘట్కేసర్ రూరల్, ఆగస్టు 24: సీఎం సహాయనిధి పేద ప్రజలకు వరమని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి తెలిపారు. మండల పరిధిలోని కొర్రెముల పంచాయతీ సుప్రభాత్ టౌన్‌షిప్‌నకు చెందిన మహిపాల్ రెడ్డికి వైద్య సహాయం నిమిత్తం సీఎం సహాయనిధి నుంచి చెక్కు మంజూరైంది. ఈ చెక్కును మంత్రి మల్లారెడ్డి మంగళవారం లబ్ధిదారుడికి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎంఆర్ఎఫ్ ద్వారా ఎంతో మంది పేదలకు లబ్ధి చేకూరుతున్నదని చెప్పారు. ఆర్థికంగా వెనుకబడిన వారు సైతం కార్పొరేట్ దవాఖానల్లో చికిత్స తీసుకునేలా సీఎంఆర్ఎఫ్ ఉపయోగపడుతున్నట్లు చెప్పారు. ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి, మాదారం సర్పంచ్ యాదగిరి, టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి బి.నాగరాజు, నాయకులు బసవరాజు పాల్గొన్నారు.
మాదారం గ్రామంలో ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటులో భూములు కోల్పోతున్న రైతులను ఆదుకుంటానని మంత్రి మల్లారెడ్డి తెలిపారు. మాదారం గ్రామంలో వ్యవసాయంపై ఆధారపడి వందల కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయని, వారి భూములను ఐటీ పార్కుకు కేటాయిస్తున్నందున భూములు కోల్పోతున్న రైతులకు ఎకరాకు రూ.60 లక్షలు, డబుల్ బెడ్ రూం ఇండ్లు, ఇంటికో ఉద్యోగం ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని మంత్రి మల్లారెడ్డిని కోరుతూ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ఎంపీపీ సుదర్శన్ రెడ్డితో పాటు మాదారం సర్పంచ్ యాదగిరి, రైతులు పాల్గొన్నారు.
బోడుప్పల్, ఆగస్టు24: ఏడు దశాబ్దాల అభివృద్ధిని ఏడేండ్లలో చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. మంగళవారం బోడుప్పల్ కార్పొరేషన్ పరిధిలో మంత్రి , మేయర్ సామల బుచ్చిరెడ్డితో కలిసి పలు అభివృద్ధి పనులు ప్రారంభించారు. 13వ డివిజన్ పరిధిలో రూ.44లక్షలతో చేపట్టిన బీటీ రోడ్డు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనులను ప్రారంభించారు. అనంతరం దేవేందర్ నగర్‌లోని రేణుకాఎల్లమ్మ ఆలయంలో నిర్వహించిన అమ్మవారి కల్యాణంలో పాల్గొన్నారు.కార్యక్రమంలో టీఆర్ఎస్ అధ్యక్షుడు మంద సంజీవరెడ్డి, పీర్జాదిగూడ మేయర్ జక్క వెంకట్‌రెడ్డి, కో ఆప్షన్ మెంబర్లు అధికారులు పాల్గొన్నారు.