శామీర్‌పేట, ఆగస్టు 21 : తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్శితులై వివిధ పార్టీల నేతలు టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. మూడుచింతల్‌పల్లి మండలం లక్ష్మాపూర్ గ్రామ వార్డు సభ్యుడు వై.బాలేశ్తో పాటు పలువురు వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్లో చేరగా మంత్రి కండువా కప్పి ఆహ్వానించాడు. కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి చిత్తాగౌడ్, గ్రామ అధ్యక్షుడు శ్రీనివాస్‌చారి, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ మధుకర్‌రెడ్డి, సర్పంచ్ ఆంజనేయులు, మురళీగౌడ్, వార్డు సభ్యులు పరమేశ్, లోకేశ్, సురేశ్ పాల్గొన్నారు.
ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. శామీర్‌పేట గ్రామానికి చెందిన రంజిత్‌కు వైద్య సహాయం నిమిత్తం సీఎంఆర్ఎఫ్ నుంచి చెక్కు మంజూరైంది. ఈ చెక్కును శనివారం మంత్రి లబ్ధిదారుడి కుటుంబసభ్యులకు అందజేశారు. టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సుదర్శన్, అఫ్జల్ఖాన్, వెంకట్‌రెడ్డి, భాస్కర్, రఘు, పాల్గొన్నారు.