పీర్జాదిగూడ, ఆగస్టు 20: పీర్జాదిగూడ నగరపాలక పరిధి… 16వ డివిజన్ గణేశ్‌నగర్ కాలనీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయంలో కాలనీ అసోసియేషన్ ప్రతినిధులు, కార్పొరేటర్ బండి రమ్య సతీశ్‌గౌడ్ సహకారంతో ధ్వజస్తంభ ప్రతిష్ట మహోత్సవాన్ని కనుల పండువగా నిర్వహించారు. ఈ మేరకు గురువారం ఉదయం 10 గంటల నుంచి సేవాకాలం, అలంకరణ, ఆరగింపు, తీర్థప్రసాద వితరణ , యంత్ర ప్రతిష్ట తదితర పూజా కార్యక్రమాలు చేశారు. అనంతరం వేద పారాయణాల మధ్య ధ్వజస్తంభ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ మహోత్సవ కార్యక్రమానికి హాజరైన కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, స్థానిక మేయర్ జక్క వెంకట్‌రెడ్డి, కార్పొరేటర్ రమ్య సతీశ్గౌడ్లతో కలిసి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో కాలనీ ప్రతినిధులు అయిలయ్య, సిద్ధారెడ్డి, రమేశ్, శ్రీనివాస్, సోమలింగం, లక్ష్మీనర్సయ్య, సోమలింగం, యాదగిరి పాల్గొన్నారు.