శామీర్‌పేట, ఆగస్టు 19 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళితబంధుతో 17 లక్షల మందికి లబ్ధి చేకూరనుందని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. తూంకుంట మున్సిపాలిటీలో గురువారం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం చేపడుతున్న కార్యక్రమాలు దేశానికే ఆదర్శమన్నారు. 28 రాష్ర్టాల్లో ఏ ప్రభుత్వం చేయలేని ఎన్నో పథకాలను తీసుకువచ్చారని, దళితబంధు దేశంలోనే ఆదర్శంగా మారబోతుందన్నారు. ప్రజా సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలతో పాటు కులవృత్తులను ప్రోత్సహించడం, నూతన విద్యావిధానాలు చేపట్టి వెయ్యి గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేశారని తెలిపారు. అనంతరం మున్సిపాలిటీలో అంతిమయాత్ర వాహనాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో చైర్మన్ రాజేశ్వర్‌రావు, వైస్ చైర్మన్ వాణివీరారెడ్డి, కమిషనర్ గంగాధర్, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, డిప్యూటీ తాసీల్దార్ శ్రీనివాస్‌రెడ్డి, ఆర్ఐ ఆదిత్య, మేనేజర్ శ్రావణ్‌కుమార్, టీఆర్ఎస్ అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, యూత్ అధ్యక్షుడు సుభాష్‌గౌడ్, లబ్ధిదారులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.