ఘట్కేసర్,జూలై31: దళిత కుటుంబాలను ఆర్థికంగా బలోపేతం చేయడానికే సీఎం కేసీఆర్ దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టారని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. శనివారం ఘట్కేసర్, పోచారం మున్సిపాలిటీల్లో కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా రూపొందించి అమలు చేస్తున్న దళిత బంధు పథకంతో దళిత కుటుంబాలను ఆర్థికంగా అన్ని వర్గాలతో సమానంగా తీసుకురావడానికే అని పేర్కొన్నారు.
పోచారం మున్సిపాలిటీలో 27 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు, 252 మందికి కొత్త రేషన్ కార్డులను మంత్రి అందజేశారు. ఘట్కేసర్ మున్సిపాలిటీలో 34మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. చైర్మన్లు పావనీ జంగయ్య యాదవ్, బి.కొండల్‌రెడ్డి, వైస్ చైర్మన్ రెడ్యానాయక్, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సురేందర్‌రెడ్డి, బి.శ్రీనివాస్ గౌడ్,వర్కింగ్ ప్రెసిడెంట్ బాలేశ్, తాసీల్దార్ విజయలక్ష్మి, కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఘట్కేసర్ రూరల్ : ఘట్కేసర్ మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో మంత్రి మల్లారెడ్డి 50 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో తాసీల్దార్ విజయలక్ష్మి, మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు కుమార్, నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.