పీర్జాదిగూడ, ఆగస్టు 24: పీర్జాదిగూడ, బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ల అభివృద్ధికి ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ను రాష్ట్ర కార్మిక శాఖా మంత్రి చామకూర మల్లారెడ్డి ఆధ్వర్యంలో కోరినట్టు నగర పాలక సంస్థ మేయర్ జక్క వెంకట్‌రెడ్డి తెలిపారు. మంగళవారం ప్రగతి భవన్లో మంత్రి కేటీఆర్‌ను కలవగా, ఇందుకు సానుకూలంగా స్పందించిన మంత్రి వివిధ అభివృద్ధి పనులకు నిధుల మంజూరుకు కృషి చేస్తానని తెలిపినట్లు పేర్కొన్నారు. మంత్రిని కలిసిన వారిలో బోడుప్పల్ నగర పాలక సంస్థ మేయర్ సామల బుచ్చిరెడ్డి, పీర్జాదిగూడ నగర పాలక సంస్థ డిప్యూటీ మేయర్ కుర్ర శివ కుమార్ గౌడ్, నాయకులు రఘుపతిరెడ్డి ఉన్నారు.
మేడ్చల్, ఆగస్టు 24(నమస్తే తెలంగాణ): మేడ్చల్ జిల్లా రావల్ కోల్ వద్ద గీతానగర్ నవజీవన్ నగర్ మైక్రో ఇండస్ట్రియల్ క్లస్టర్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని మల్కాజిగిరి జిల్లా టీఆర్ఎస్ పార్లమెంటరీ నియో జకవర్గం ఇన్చార్జి మర్రి రాజశేఖర్ రెడ్డి పరిశ్రమల శాఖ మంత్రి కే.తారక రామారావుకు విజ్ఞప్తి చేశారు. ఈ ఇం డస్ట్రియల్ క్లస్టర్‌ను ఇదివరకే కేంద్ర ప్రభుత్వం క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం(సీడీపీ) కింద అనుమతించినట్లు, ఈ ఏడాది సెప్టెంబర్ లోగా ప్రాజ క్టు ప్రారంభం కాకుంటే ప్రాజక్టును రద్దు చేస్తామని కేంద్రం రిమైండర్ పంపినట్లు ఆయన మంత్రి దృష్టికి తీసుకు వెళ్లారు.
రాజశేఖర్ రెడ్డి మంగ ళవారం ప్రగతిభవన్‌లో మంత్రి కేటీఆ ర్ను కలిసి ప్రాజక్టుకు సంబంధించిన వివరాలను మంత్రికి అందజేశారు. ప్రాజక్టు వ్య యం రూ.10.36 కోట్లు కాగా, ప్రాజక్టు మంజూరు ఉత్తర్వుల ప్రకారం కేంద్ర ప్రభుత్వం 68.57 శాతం, పరిశ్రమల సంఘం వాటా 4.83 (50 లక్షలు) శాతం, రాష్ట్ర ప్రభుత్వ వాటా మిగిలిన 26.60 శాతమని ఆయన పేర్కొన్నారు.