మేడ్చల్, ఆగస్టు12(నమస్తే తెలంగాణ): మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఇన్చార్జి కలెక్టర్‌గా గురువారం ఎస్.హరీశ్ బాధ్యతలను స్వీకరించారు. ఇప్పటి వరకు జిల్లా కలెక్టర్‌గా విధులు నిర్వహించిన శ్వేతా మహంతి సెలవుపై వెళ్లిన నేపథ్యంలో ఎస్.హరీశ్‌కు జిల్లా ఇన్చార్జి కలెక్టర్‌గా బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు గురువారం హరీశ్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్లు నర్సింహారెడ్డి, శ్యాంసన్, డీఆర్వో లింగ్యానాయక్ కలెక్టర్ హరీశ్‌కు పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. అనంతరం పలు శాఖల అధికారులు కలెక్టర్‌ను కలిశారు.
ధరణిలో పెండింగ్ ఫైళ్లన్నీ వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఇన్చార్జి కలెక్టర్ ఎస్.హరీశ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో గురువారం అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ధరణిలో ఇప్పటి వరకు ఎన్ని భూములు రిజిస్ట్రేషన్ అయ్యాయి, ఏమైనా పెండింగ్‌లో ఉన్నాయా, ప్రతిరోజూ ఎన్ని స్లాట్లు బుక్ అవుతున్నాయన్న విషయాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు నర్సింహారెడ్డి, శ్వాంసన్, డీఆర్వో లింగ్యానాయక్, ఆర్డీవో రవి, ఏవో వెంకటేశ్వర్లు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.