కంటోన్మెంట్, ఆగస్టు 17: సీఎం సహాయనిధి పేదలకు వరంలాంటిదని టీఆర్ఎస్ పార్టీ మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం ఇన్చార్జి మర్రి రాజశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని ఐదో వార్డు సెకండ్ లక్ష్మీనగర్‌కు చెందిన ఇద్దరికి సీఎం సహాయనిధి నుంచి రూ.53వేల 500 విలువ గల చెక్కులు మంజూరయ్యాయి. మంగళవారం బోయిన్‌పల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పెద్దాల నర్సింహతో కలిసి మర్రి రాజశేఖర్‌రెడ్డి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనారోగ్యంతో బాధపడుతూ ప్రైవేట్ దవాఖానల్లో ఖర్చుపెట్టి వైద్యం చేయించుకోలేని పేదలకు సీఎం సహాయనిధి దోహదం చేస్తున్నదని తెలిపారు.