కీసర, ఫిబ్రవరి 21 : కీసరలోని శ్రీ మల్లిఖార్జున స్వామి ఆలయంలో జాతర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సోమవారం స్వామివారికి ప్రత్యేక పూజ కార్యక్రమాలను నిర్వహించారు. చర్లపల్లి కార్పొరేటర్ బొంతు శ్రీదేవి విచ్చేసి స్వామి వారికి ప్రత్యేక పూజ కార్యక్రమాలను నిర్వహించారు.
యాదవ సంఘం ఆధ్వర్యంలో ఆలయం ముందు అగ్నిగుండాల కార్యక్రమం ఘనంగా జరిగింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు భక్తులతో ఈ ఆలయం కోలాహలంగా మారింది.
కీసర సర్పంచ్ నాయకపు మాధురి వెంకటేశ్ ఆలయం వద్ద భక్తుల సౌకర్యార్థం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయంకు విచ్చేసిన అతిథులను యాదవ సంఘం కమిటీ వారు శాలువలు కప్పి ఘనంగా సత్కారించారు.