Keesara | కీసర, ఫిబ్రవరి 20 : కీసరగుట్ట బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఈనెల 24వ తేదీ నుంచి గ్రామీణ క్రీడోత్సవాలను జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించాలని తెలంగాణ స్పోర్ట్స్ ఆథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. మేడ్చల్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాల్లోని విద్యార్థిని విద్యార్థులకు ఈనెల 24, 25 తేదీల్లో కబడ్డీ, ఖో-ఖో, వాలీబాల్ క్రీడలను నిర్వహించనున్నారు.
యూత్ సంఘాలకు ఈనెల 28వ తేదీ, వచ్చే నెల మార్చి 1వ తేదీన నిర్వహించనున్నారు. ఈ క్రీడల రిజిస్ర్టేషన్ కోసం ఈనెల 23వ తేదీలోగా చేసుకోవాలని, ఇతర వివరాలకు వెంకటేశ్ సెల్ఫోన్ నెంబర్ 8106252751 ను సంప్రదించాలని కోరారు. ఈ క్రీడల ముగింపు వేడుకలు వచ్చే నెల మార్చి 1వ తేదీన కీసరగుట్టలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్లో నిర్వహించడం జరుగుతుందని అన్నారు.