Kapra | కాప్రా, మే 5: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కాప్రా మండల పరిధిలో చేపట్టిన అక్రమ నిర్మాణాలపై రెవెన్యూ అధికారులు కొరడా ఝుళిపించారు. సర్వే నంబర్ 199/1లో ఆదర్శనగర్ పక్కన ఖాళీ స్థలాల్లో అక్రమంగా నిర్మించిన గదులు, ఇతర నిర్మాణాలను జేసీబీతో కూల్చివేశారు.
ఈ సందర్భంగా కాప్రా తహసీల్దార్ సుచరిత మాట్లాడుతూ.. కొంతమంది అక్రమార్రకులు ప్రభుత్వ స్థలాలను ప్లాట్లుగా చేసి పేద ప్రజలకు అమ్ముకుంటున్నారని, ఆయా స్థలాల్లో గదులు నిర్మిస్తున్నారని తమకు ఫిర్యాదులు అందాయని తెలిపారు. ఈ అక్రమ నిర్మాణాలను కూల్చివేసినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణాలు చేపడితే సహించేది లేదని.. నిర్దాక్షిణ్యంగా కూల్చివేస్తామని తహసీల్దార్ హెచ్చరించారు.