Uppal | చర్లపల్లి, ఫిబ్రవరి 22 : ఉప్పల్ నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసేందుకు తన వంతు కృషి చేస్తానని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి తెలిపారు. నియోజకవర్గ పరిధిలోని చర్లపల్లి డివిజన్లో నెలకొన్న మంచినీటి పైప్‌లైన్ నిర్మాణం, డ్రైనేజీ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ డివిజన్ నాయకులతో కలిసి జలమండలి ఎండీ ఆశోక్రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గ పరిధిలోని డివిజన్లలో డ్రైనేజీ సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరించేందుకు తగు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇప్పటికే పలు అభివృద్ధి పనులకు సంబంధించి ప్రతిపాదనల నివేదికను తయారు చేశామని పేర్కొన్నారు. అదేవిధంగా డివిజన్లలో మంచినీటి సమస్యలను పరిష్కరిందుకు కృషి చేస్తున్నామని అన్నారు. నియోజకవర్గ పరిధిలోని మంచినీటి పైప్‌లైన్ నిర్మాణం, డ్రైనేజీ సమస్యలపై జలమండలి ఎండీని కలిశామని, త్వరలో నిధుల మంజూరుకు కృషి చేస్తామని హామి ఇచ్చారని తెలిపారు. నియోజకవర్గ పరిధిలో సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరించేందుకు కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు నేమూరి మహేశ్‌గౌడ్, బైరీ నవీన్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
22సీపీఎల్వై1 : చర్లపల్లి డివిజన్లో నెలకొన్న డ్రైనేజీ, మంచినీటి సమస్యలను పరిష్కరించాలని కొరుతూ జలమండలి ఎండీ ఆశోక్రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేస్తున్న ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి తదితరులు