US Chess Competition | రామంతాపూర్, ఏప్రిల్ 28 : అమెరికాలో నిర్వహించిన చెస్ టోర్నమెంట్లో హైదరాబాద్ యువకుడు సత్తా చాటాడు. అమెరికాలోని చికాగో ఆంధ్రా అసోసియేషన్ (సీఏఏ) 9వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని చెస్ పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో హైదరాబాద్‌లోని మౌలాలి హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన మనోజ్ చంద్ర కొంపల్లి పాల్గొన్నాడు. ఈ చెస్ టోర్నమెంట్లో విజేతగా నిలిచాడు.
కాగా, ఈ చెస్ టోర్నమెంట్లో మనోజ్ చంద్ర విజేతగా గెలవడం వరుసగా ఇది రెండోసారి కావడం గమనార్హం. ఈ సందర్భంగా మనోజ్ చంద్రను చికాగా ఆంధ్రా అసోనియేషన్ ప్రతినిధులు, డైరెక్టర్ స్పోర్ట్స్ నరసింహరావు అభినందించారు. అతనికి చెస్ టోర్నమెంట్ ట్రోఫీని అందజేశారు. ఇక సీఏఏ వేడుకల సందర్భంగా చికాగోలోని నేపర్‌విల్లేలో నిర్వహించిన ఈ చెస్ టోర్నమెంట్‌కు పెద్ద సంఖ్యలో తెలుగువాళ్లు హాజరయ్యారు.