ఘట్కేసర్, ఆగస్టు 12 : మున్సిపాలిటీ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నామని మున్సిపాలిటీ చైర్మన్ కొండల్‌రెడ్డి అన్నారు. గురువారం 15వ వార్డులో సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ మున్సిపాలిటీ నిధులు రూ.11 లక్షల వ్యయంతో రోడ్డును నిర్మిస్తున్నామని తెలిపారు. మున్సిపాలిటీలో నిర్వహించే అభివృద్ధ్ది పనులకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకరిస్తూ, నిధులను అందిస్తున్నదని అన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డుల్లో ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నట్లు ఆయన వివరించారు. ఇప్పటికే మున్సిపాలిటీ పరిధిలో మురుగునీటి కాలువలు, రోడ్లు, పరిశుభ్రత, పచ్చదనం, వైకుంఠధామాల అభివృద్ధి, తాగునీటి సరఫరా, పైపులైన్ల ఏర్పాటు తదితర పనులు కొనసాగుతున్నాయన్నారు.న్నారు. కార్యక్రమంలో కమిషనర్ సురేశ్, వైస్ చైర్మన్ రెడ్యా నాయక్, వార్డు కౌన్సిలర్ అబ్బవతి సరిత, టీఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్, ఇతర వార్డుల కౌన్సిలర్లు పాల్గొన్నారు.