కుత్బుల్లాపూర్,జనవరి7 : రోడ్డు ప్రమాదాల నివారణకు ఆరోగ్యం సైతం ఖ్యమని మేడ్చల్ రవాణా శాఖా జిల్లా అధికారి రఘునందన్‌గౌడ్ అన్నారు. జాతీయ రహాదారి భద్రత మాసం ఉత్సవాల సందర్భంగా బుధవారం మేడ్చల్ రవాణా శాఖా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరంలో పలు వాహనాల డ్రైవర్లకు పలు పరీక్షలు చేసి మందులు అందజేశారు. ఈ సందర్భంగా డీటీఓ రఘునందన్‌గౌడ్ మాట్లాడుతూ.. వాహనాలను నడిపే సమయంలో మనం ఆరోగ్యంగా, ఏకాగ్రతతో ఉన్నప్పుడే ప్రమాదాలను నివారించేందుకు ఆస్కారం ఉంటుందన్నారు.
ప్రతి ఒక్కరు వాహనాలను నడిపే సమయంలో ఆరోగ్యం విషయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రోడ్డు ప్రమాదాలను నివారించడంతో పాటు సురక్షితంగా గమ్యస్థానాలను చేరేంత వరకు ప్రతి ఒక్కరు రోడ్డు నిభందనలను పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మోటర్ ఇన్స్పెక్టర్లు సాదుల శ్రీనివాస్, ఎంఆర్ శిల్ప, ఎఎంవిఐ త్రివేణిబాయి, కిరణ్‌కుమార్‌లతో పాటు ఆర్టీఏ సభ్యుడు జైపాల్‌రెడ్డి, డ్రైవర్లు పాల్గొన్నారు.