Ragidi Lakshma reddy | కాంగ్రెస్ మాటలను నమ్మి మరోసారి మోసపోవద్దు : బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి
Ragidi Lakshma reddy | అసెంబ్లీ ఎన్నికల్లో మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వందరోజుల్లో వాటిని తుంగలో తొక్కిందని మల్కాజిగిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి ఆరోపించారు.
మల్కాజిగిరి : అసెంబ్లీ ఎన్నికల్లో మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ (Congress) వందరోజుల్లో వాటిని తుంగలో తొక్కిందని మల్కాజిగిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి (BRS candidate) రాగిడి లక్ష్మారెడ్డి (Ragidi Lakshmareddy) ఆరోపించారు. అదే పార్టీ మరోసారి మోసం చేసేందుకు ఎంపీ ఎన్నికలకు వస్తుందని, వారి మాటలను నమ్మి మోసపోవద్దని కోరారు. మల్కాజిగిరి సర్కిల్ సఫిల్‌గూడ మినీ ట్యాంక్ బండ్, ఈస్ట్ ఆనంద్‌బాగ్ డివిజన్ శ్రీనగర్‌కాలనీలో ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్(MLA Marri Rajashekar) తో కలసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ మల్కాజిగిరి ఎంపీగా ఎన్నికైన తర్వాత రేవంత్‌రెడ్డి ( Revanth Reddy) నియోజకవర్గానికి ఎలాంటి అభివృద్ధి చేయలేదని విమర్శించారు. కేంద్రం నుంచి వచ్చే నిధులను వినియోగించుకోలేక పోయారని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మల్కాజిగిరి నియోజక వర్గం అభివృద్ధికి నాటి ముఖ్యమంత్రి కేసీఆర్(KCR) కోట్లాది రూపాయలను ఖర్చుచేశారని పేర్కొన్నారు. దీంతో అసెంబ్లీ ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి మర్రిరాజశేఖర్‌ను 50 వేలకు పైగా మెజారిటీతో గెలిపించారని వెల్లడించారు. పార్లమెంట్ ఎన్నికల్లోనూ కారు గుర్తుకు ఓటువేసి గెలిపించాలని కోరారు.
Read Today's Latest Rangareddy Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

