సైబర్ క్రైం హెల్ప్‌డెస్క్‌కు మంచి స్పందన

జీడిమెట్ల, మార్చి 30 : సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని జీడిమెట్ల పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన సైబర్ క్రైం హెల్ప్ డెస్క్‌కు మంచి స్పందన లభిస్తుంది. ఇప్పటి వరకు సైబర్ క్రైంకు సంబంధించిన నేరాలను గచ్చిబౌలిలోని సైబరాబాద్ కమిషనరేట్ సైబర్ క్రైం పోలీసులే దర్యాప్తు చేస్తుండే వారు ఇటీవల కాలంలో ఆన్లైన్ మోసాలు అధికమవుతుండడంతో ప్రతి పోలీస్ స్టేషన్లో ఈ నెల 21వ తేదీ నుంచి సైబర్ క్రైం హెల్ప్ డెస్క్‌ను జీడిమెట్ల పోలీస్‌స్టేషన్‌లో ప్రారంభించారు. దుండిగల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆన్లైన్, ఫేస్బుక్, ఇతర డాట్ కామ్‌లకు సంబంధించిన మోసాలు, నేరాలకు సంబంధించి ఫిర్యాదులను ఇక్కడే స్వీకరిస్తారు. ఆన్లైన్ బాధితులు ఇక్కడే ఫిర్యాదు చేసుకునే అవకాశం కల్పించారు.
వాస్తవాలను ఫిర్యాదు చేయండి
ఆన్లైన్లో జరుగుతున్న మోసాలు, నేరాలను బాధితులు వాస్తవాలను ఫిర్యాదుల్లో పేర్కొంటే ఆ కేసులను సత్వరమే పరిష్కరించే వీలు కలుగుతుంది. నిర్భయంగా బాధితులు వచ్చి ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచబడుతాయి. అవసరంలేని ఆన్లైన్ సైట్ల జోలికి వెళ్లవద్దు. సైబర్ క్రైం మోసాలను తెలుసుకుని ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మీకు సంబంధించిన ఓటీపీలను ఇతరులకు సెండ్ చేయవద్దు. అపరిచితుల మాటలు నమ్మి ఫోన్‌పే, గూగుల్ పే ద్వారా డబ్బులను పోగొట్టుకోవద్దు. – కె.బాలరాజు, ఎస్హెచ్ఓ జీడిమెట్ల పోలీస్‌స్టేషన్
నాలుగు కేసులు నమోదు
- 23వ తేదీన తాను ఆసుపత్రిలో ఉన్నానని అత్యవసరంగా డబ్బులు కావాలని ఫేస్బుక్లో ఓ వ్యక్తి మెసేజ్‌లు పెట్టడంతో ఓ బాధితురాలు రూ.70 వేలు పంపించి మోసపోయింది.
- తేదీన ఓఎల్ఎక్స్ యాప్‌లో యాక్టివా అమ్మకానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటన చూసి రూ.31 వేలు కట్టి ఓ మహిళ మోసపోయింది.
- నెల 25న బీఎస్ఎన్ఎల్ సిమ్ కార్డులో రూ.11 రీచార్జి చేసుకోవాలని లేకుంటే సిమ్ కార్డు బ్లాక్ అవుతుందని తప్పుడు మెసేజ్‌లు పెట్టి బాధితురాలి నుంచి రూ. 70 వేలు కాజేశారు.
- నెల 26న ‘వి2.కామ్’ లో మెసేజ్‌లు పెట్టి రూ.12,600 కడితే బైక్ వస్తుందని మెసేజ్ చూసి రూ.30 వేల వరకు చెల్లించి మోసపోయిన ఓ బాధితురాలు.
Read Today's Latest Rangareddy Rangareddy News in Telugu and Telugu News
- Tags
- Cyber Crime
- Help desk
RELATED ARTICLES
తాజా వార్తలు
Breast Cancer | రొమ్ము క్యాన్సర్‌కు విజయవంతంగా చికిత్స చేస్తే మళ్లీ వస్తుందా.. నిపుణులు ఏం చెబుతున్నారు..?
Pressure Cooker | ప్రెషర్ కుక్కర్లో వంట చేస్తున్నారా.. రుచి తగ్గకుండా ఉండాలంటే ఇలా చేయాలి..
Gang robs women passengers | సిగ్నల్ ట్యాంపరింగ్‌తో రైలు నిలిపి.. మహిళా ప్రయాణికుల నుంచి బంగారం దోచుకున్న ముఠా
Harish Rao | కరువు మండలాలు ప్రకటించడం తప్ప సహాయంపై చేతులెత్తేసిన రేవంత్ : మాజీ మంత్రి హరీష్‌రావు
PCOS | పీసీఓఎస్ సమస్య మహిళల్లో అసలు ఎందుకు వస్తుంది.. ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి..?
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

