Marri Rajashekhar Reddy | నేరేడ్మెట్ , మార్చి 21 : యువత ప్రభుత్వ ఉద్యోగాలు, సాఫ్ట్వేర్ రంగాల్లో ఆధారపడకుండా వ్యాపార రంగాలలో రాణించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. శుక్రవారం బోయిన్పల్లిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ‘మీట్ యూ’ యాప్ వాల్పోస్టర్ను ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ స్వయం ఉపాధితో పాటు మరికొందరికి ఉపాధి కల్పించాలన్నారు. యువత యొక్క స్వయం ఉపాధి ద్వారా దేశాభివృద్ధి తోడ్డడుతుందన్నారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు యువత స్వయం ఉపాధికై రుణాల రూపేనా సహాయం చేయాలని అన్నారు. మీట్ యూ యాప్ ద్వారా మల్కాజిగిరిలోని ప్రజలకు అన్నివేలలా అందుబాటులో ఉంటూ నాణ్యమైన చికెన్, మటన్ సాధ్యమైనంత త్వరగా డెలివరి చేస్తామని నిర్వాహకులు గడ్డమీది శ్యామల, సాహిత్ కుమార్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి చికెన్ షాపు ఓనర్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.