రామంతాపూర్, అక్టోబర్ 28 : దేశసేవలో అమరులైన పోలీసు లను స్మరించుకోవాలని మల్కాజిగిరి ఏసీపీ ఎస్. చక్రపాణి అన్నారు. మంగళవారం పోలీసుల అమరవీరుల సంస్మరణ దినోత్సవాల ను పురస్కరించుకొని రాచకొండ కమిషనర్ ఆదేశాల మేరకు రామంతాపూర్ అరోరా కళాశాల విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు.
అనంతరం పాల్టెక్నిక్ మైదానంలో జరిగిన సమావేశంలో మాట్లాడారు. ఎంతోమంది పోలీసులు దేశం కోసం ప్రాణాలు అర్పించి అమరులైనారన్నారు. ప్రజల ప్రాణాలను రక్షించడంలో పోలీసుల కృషి ఎంతో గొప్పదన్నారు. ఈ కార్యక్రమంలోఉప్పల్ అశోక్, కె. భాస్కర్, మేడిపల్లి ఎస్హెచ్ఓ ఆర్. గోవింద్‌రెడ్డి, మౌలాలి ఎస్హెచ్ఓ సైదులు, ఉప్పల్ డిఐ వై. రామలింగారెడ్డి, ఎస్ఐలు విద్యార్థులు పాల్గొన్నారు.