Vijay Devarakonda | కీసర, మే 3: ప్రముఖ సినీ నటుడు విజయ్ దేవరకొండపై కీసర పోలీస్ స్టేషన్లో ఆదివాసీలు ఫిర్యాదు చేశారు. తమను అవమానించేలా వ్యాఖ్యలు చేశారని ఈ మేరకు ఎన్బీఎంఐ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు, న్యాయవాది రవిరాజ్ రాథోడ్, మురళీ నాయక్‌లు కీసర సీఐ శ్రీనివాస్‌కు ఫిర్యాదు చేశారు.
సూర్య నటించిననో రెట్రో సినిమా ప్రమోషన్ ఈవెంట్లో పాల్గొన్న విజయ్ దేవరకొండ ఉగ్రవాదుల ప్రవర్తనకు చదువు లేకపోవడం, ఆదివాసుల మాదిరిగా ఉండటమే కారణం అన్నట్లుగా వ్యాఖ్యానించారు. ఈ మాటలు ఆదివాసి సమాజాన్ని తీవ్రంగా బాధించాయని, ఇది మానసికంగా అవమానించడమేనని న్యాయవ్యాదులు తాము చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి కీసర సీఐ ఫిర్యాదును స్వీకరించారు. కాగా ఆదివాసుల హక్కుల పరిరక్షణకు కట్టుబడి ఉండే నాయకులు, సంఘాలు ఈ కేసును తీవ్రంగా ఖండిస్తున్నాయి. అతని మీద కేసు నమోదు చేసి తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.