24 గంటలు సేవలు

- కొవిడ్ బాధితులకు 27 అంబులెన్స్ వాహనాల వినియోగం
- అంబులెన్స్‌ల ద్వారా ప్రతి రోజూ 40 నుంచి 50 మంది వివిధ దవాఖానలకు తరలింపు
- అవసరమైన వారికి అంబులెన్స్‌లో ఆక్సిజన్ – ప్రజల మన్ననలు పొందుతున్న 108 సిబ్బంది
మేడ్చల్, మే 20 (నమస్తే తెలంగాణ): కొవిడ్ బాధితులకు 108 అంబులెన్స్‌లు నిరంతరాయంగా సేవలందిస్తున్నాయి. సమాచారం అందుకున్న వెంటనే వారి ని వివిధ వైద్యశాలలకు తరలిస్తున్నా యి. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో ని మేడ్చల్, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, మల్కాజిగిరి, ఉప్పల్ నియోజకవర్గాల్లోని 27 అంబులెన్స్‌లను అధికారులు వినియోగిస్తున్నారు.
24 గంటలు – 1,573 మందికే సేవలు..
మేడ్చల్ జిల్లాలో కొవిడ్ బాధితులకు ప్రత్యేకంగా ఏడు అంబులెన్స్‌లను కేటాయించారు. అయితే అవి సరిపోకపోవడంతో జిల్లా అధికారులు మరో ఇరవై అంబులెన్స్‌లను వినియోగిస్తున్నారు. ఏప్రిల్ రెండో వారం నుంచి ఇప్పటి వరకు ప్రతి రోజు 40 నుంచి 50 మంది మొత్తంగా 1,573 కొవిడ్ బాధితులను అంబులెన్స్‌ల్లో వివిధ ప్రభుత్వ, ప్రైవే ట్ వైద్యశాలలకు తరలించారు. కొవిడ్ బాధితులకు సేవలందించేందుకు 108 సిబ్బంది 24 గంటల పాటు శ్రమిస్తున్నారు. బాధితులను తరలించే సమయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వాహనాన్ని శానిటైజ్ చేయడంతో పాటు పీపీఈ కిట్లు వాడుతున్నారు.
27 అంబులెన్స్‌ల ద్వారా సేవలు..
జిల్లా వ్యాప్తంగా 27 అంబులెన్స్‌లతో కొవిడ్ రోగులకు సేవలు అందిస్తున్నాం. సమాచారం అందగానే బాధితులు కోరిన దవాఖానలో చేర్పిస్తు న్నాం. ఏప్రిల్‌లో 813 బాధితులకు సేవలు అందించాం. రెండు నెలలుగా 108 సిబ్బంది నిత్యం పని చేస్తున్నారు. కొవిడ్ బాధితులను అంబులెన్స్‌లో తరలించే ముందు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. అత్యవసర సమయా ల్లో ఆక్సిజన్ అందిస్తున్నాం. – నరేందర్‌రెడ్డి, మేడ్చల్, 108 కో ఆర్డినేటర్
ప్రత్యేక శ్రద్ధతో వైద్యం చేస్తున్నాం..
వైద్యశాలకు వచ్చే రోగులకు ప్రత్యేక శ్రద్ధతో వైద్యం చేస్తున్నాం. కరోనాతో బాధపడుతున్న రోగులను గుర్తించి ఐసొలేషన్ కేంద్రానికి పంపుతున్నాం. వైద్యశాలలో 10 ఆక్సిజన్ బెడ్లు ఉన్నాయి. త్వరలో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు కాబోతున్నది. అత్యాధునిక వసతులు అందుబాటులో ఉన్న ఈ వైద్యశాలలో రోగులకు అవసరమైన అన్ని సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నాం. రాజు, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్
Read Today's Latest Rangareddy Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish rao | నో పబ్లిక్ ఇంట్రెస్ట్.. ఓన్లీ ప్రైవేట్ ఇంట్రెస్ట్.. సీఎం రేవంత్ సర్కార్ గెజిట్‌పై హరీశ్ రావు
White Noise Machine | నిద్రలేమి సమస్యను తగ్గించే వైట్ నాయిస్ యంత్రం.. అసలేమిటిది.. ఎలా పనిచేస్తుంది..?
పలువురికి బానోత్ మనీషా లక్ష్మి పరామర్శ
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
BRS | మాజీ ఎమ్మెల్యే గండ్ర సమక్షంలో బీఆర్ఎస్లో చేరిన యువత
ట్రెండింగ్ వార్తలు
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?

