ఇబ్రహీంపట్నం, ఫిబ్రవరి 25 : ఇబ్రహీంపట్నం మార్కెట్‌యార్డు ఆధునీకరణ పనులకు సమగ్ర చర్యలు చేపట్టనున్నట్లు టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. మార్కెట్‌యార్డు ఆదాయం పెంచటం కోసం సాగర్హ్రదారి నుంచి యార్డు వెనుకాల వరకు 30అడుగుల వెడల్పుతో నూతనంగా రోడ్డు నిర్మించి దానికి ఇరువైపులా షాపింగ్ కాంప్లెక్స్‌లను నిర్మించేలా రూపొందించిన ప్రతిపాదనల్లో భాగంగా ఆయన శుక్రవారం మార్కెటింగ్‌శాఖ అదనపు సహాయ సంచాలకుడు లక్ష్మణుడు, జిల్లా మార్కెటింగ్ అధికారులు సంతోశ్‌కుమార్, ఈఈ రాధాకృష్ణతో కలిసి ఆయన మార్కెట్‌యార్డులో పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మార్కెట్‌యార్డులో వ్యాపారులకు అనుకూలంగా ఉండే స్థలాలను సద్వినియోగం చేసుకుని మార్కెటింగ్ ఆదాయాన్ని పెంపొందించుకోవాలన్నారు. మండల కేంద్రంలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి అనువైన స్థలంతో పాటు మార్కెట్‌యార్డు వెనుకవైపు కాలనీల ప్రజలకు సౌకర్యంగా నూతన రోడ్డు నిర్మించనున్నట్లు వివరించారు. మార్కెట్‌యార్డులో రెండుషాపింగ్ కాంప్లెక్స్‌లు ఉన్నాయని, వీటితో పాటు ట్రేడర్స్‌కు అవసరమైన రీతిలో షెటర్లు, గోదాములు నిర్మించినట్లు తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్‌కమిటీ మాజీ చైర్మన్ సత్తువెంకటరమణారెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ కప్పరి స్రవంతి, ఎంపీపీ కృపేశ్, వైస్‌చైర్మన్ ఆకుల యాదగిరి, మార్కెట్ కమిటీ డీఈ నాగేశ్వర్రావు, మార్కెటింగ్ కార్యదర్శి శ్రీనివాస్, డీసీసీబీ వైస్‌చైర్మన్ సత్తయ్య, గడ్డిఅన్నారం మార్కెట్ కమిటీ చైర్మన్ ముత్యంరెడ్డి, కౌన్సిలర్లు పద్మ, బాలరాజు, సుధాకర్, మోహన్‌నాయక్, ప్రసన్నలక్ష్మి చిన్న, మమత పాల్గొన్నారు.
రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు తగిన ప్రాధాన్యం కల్పిస్తామని టీఆర్ఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మంచాల మండలం చెన్నారెడ్డిగూడ గ్రామానికి చెందిన బహదూర్‌ను రంగారెడ్డి జిల్లా ఎస్సీ, ఎస్టీ, విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యుడిగా నియమించిన సందర్భంగా టీఆర్ఎస్ మండల నాయకులు ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తూ దళిత, గిరిజనులకు బంధువుగా సీఎం కేసీఆర్ నిలిచారన్నారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో ఎంపీపీ నర్మద, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చీరాల రమేశ్, నాయకులు బి. పుల్లారెడ్డి, బి. యాదయ్య, ఎ.చంద్రయ్య, బద్రినాథ్గుప్తా, జె. కిషన్‌రెడ్డి, చిందం రఘుపతి, పల్లె జంగారెడ్డి, ఎండీ జానీపాషా, రావుల శంకర్, కె.శ్రీశైలం, ఎం.వెంకటేశ్ ఉన్నారు.