Woman Missing | మొయినాబాద్, జూలై 06 : భర్త పనికి వెళ్లి ఇంటికి తిరిగి వచ్చే లోపు భార్య ఇంటి నుంచి వెళ్ళిపోయింది. ఈ సంఘటన మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని హిమాయత్ నగర్ గ్రామంలో ఉంటున్న కొర్ర శివ నాయక్ , కొర్ర సునీతను గత 15 ఏండ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. ఈ నెల 29వ తేదీన 10 గంటలకు ఇంటి నుంచి ఉద్యోగానికి వెళ్ళాడు భర్త. ఆ సమయంలో భార్య సునీత ఇంట్లోనే ఉంది. శివ నాయక్ అదే రోజు సాయంత్రం 4 గంటలకు ఇంటికి తిరిగి వచ్చే లోపు భార్య ఇంట్లో కనిపించలేదు. దీంతో అన్ని ప్రదేశాల్లో గత వారం రోజులుగా వెతుకుతున్నారు. బంధువులకు ఫోన్ చేసి తెలుసుకున్న రాలేదని చెప్పారు. ఎంత వెతికిన ఆమె ఆచూకీ తెలియకపోవడంతో భర్త ఆదివారం పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేశాడు. అతని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.