యాచారం, మే25 : యువత భక్తి భావాన్నిపెంపొందించుకునేందుకు కృషి చేయాలని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ ఎస్ జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. మండలంలోని మల్కీజ్‌గూడ గ్రామంలో కామరాతి సమేత బీరప్ప స్వామి కళ్యాణ మహోత్సవంలో భాగంగా ఆదివారం ఆయన ఆలయాన్ని సందర్శించి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..యువత భక్తి భావాన్ని పెంపొందించే దిశగా అడుగులు వేయాలన్నారు.
బీరప్ప స్వామి ఆశీస్సులతో ఈ ఏడాది వర్షాలు పుష్కలంగా కురిసి, చెరువు కుంటలు నిండి పాడి పంటలతో రైతులు సుభిక్షంగా ఉండాలని ఆయన కోరారు. గ్రామాలలో భక్తి భావం ఉట్టిపడేలా దేవాలయాలు నిర్మించ డం అభినందనీయమన్నారు. పురాతన ఆనవాళ్లను పరిరక్షించేందుకు ఆలయాలను పునర్నిమించేందుకు కృషి చేయాలన్నారు. దేవాలయాల అభివృద్ధికి తనవంతు కృషి చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కర్నాటి రమేష్‌గౌడ్, ప్రధాన కార్యదర్శి పాచ్చ బాషా, నాయకులు గుండెల్లి మల్లేష్, డేరంగుల శంకర్, బోడ అబ్బయ్య, పాండు, ఉన్నారు.