రూ.లక్ష సాయం ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలి
బీసీలకు రూ.లక్ష ఆర్థిక సాయానికి వచ్చిన దరఖాస్తుల పరిశీలన వేగవంతం చేయాలని సంగారెడ్డి కలెక్టర్ డాక్టర్ శరత్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో వివిధ అభివృద్ధి పనులు, పథకాల పురోగతిపై సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షించారు.
- దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించాలి
- గృహలక్ష్మి లబ్ధిదారుల ఎంపిక పారదర్శంగా జరగాలి
- హరితహారం లక్ష్యాన్ని చేరుకోవాలి
- మనఊరు-మనబడి పనులు వేగంగా పూర్తి చేయాలి
- సంగారెడ్డి కలెక్టర్ శరత్
- అభివృద్ధి పనులు, పథకాల పురోగతిపై అధికారులతో సమీక్ష
సంగారెడ్డి కలెక్టరేట్, జూలై 3: బీసీలకు రూ.లక్ష ఆర్థిక సాయానికి వచ్చిన దరఖాస్తుల పరిశీలన వేగవంతం చేయాలని సంగారెడ్డి కలెక్టర్ డాక్టర్ శరత్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో వివిధ అభివృద్ధి పనులు, పథకాల పురోగతిపై సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో పోడు పట్టాల పంపిణీకి సిద్ధం చేయాలన్నారు. లబ్ధిదారులకు సంబంధించిన పట్టాదారు పాస్ పుస్తకాలు మంత్రి అందజేయనున్నట్టు వెల్లడించారు. అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. గృహలక్ష్మి పథకం కింద ప్రభుత్వం జారీ చేసిన నిబంధనల మేరకు పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక జరగాలని స్పష్టం చేశారు. పథకంలో భాగంగా ఒక్కో లబ్ధిదారుడికి రూ.3 లక్షలు ఇస్తారని, 100 శాతం సబ్సిడీ లభిస్తుందన్నారు. అర్హులైన కుటుంబంలోని మహిళల పేరున గృహలక్ష్మి ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ఇల్లు లేని నిరుపేదలకు ఈ పథకానికి అర్హులని స్పష్టం చేశారు. హరితహారం జిల్లా లక్ష్యాన్ని ఆయా శాఖలకు కేటాయించిన లక్ష్యం మేరకు పూర్తి చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
రెండో విడత గొర్రెల పంపిణీ వేగంగా పూర్తి చేయాలి
జిల్లాలో రెండో విడత గొర్రెల పంపిణీ వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. కస్టం మిల్లింగ్ రైస్ వేగవంతంగా ఎఫ్‌సీఐకి డెలివరీ చేసేలా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారికి సూచించారు. మన ఊరూరు -మన బడి కింద చేపట్టిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధితులకు సూచించారు. రెండో విడత దళితబంధు పథకంలో లబ్ధిదారులను గుర్తించాలన్నారు. అందుకు సంబంధించిన ప్రక్రియ వేగవంతం చేయాలన్నారు. నియోజకవర్గ, మండల ప్రత్యేక అధికారుల నియామకం చేయాలని ఎస్సీ కార్పొరేషన్ ఈడీకి సూచించారు. జిల్లాలోని అన్ని పంచాయతీల్లోని వైకుంఠధామాలకు నీటి వసతి, విద్యుత్ సౌకర్యం 100 శాతం కల్పించాలన్నారు. పీహెచ్సీ సబ్ సెంటర్ భవన నిర్మాణాలకు 100 శాతం గ్రౌండింగ్ పూర్తి కావాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ వీరారెడ్డి, డీఆర్వో నగేశ్, జెడ్పీ సీఈవో ఎల్లయ్య, ఆయా సంక్షేమ శాఖల, విద్యా, వైద్య ఆరోగ్య శాఖల అధికారులు పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

