Home
Rangareddy
Makar Sankranti Festival Has Arrived And Everywhere You Look You Can See The Sound Of Kites
పతంగుల సంబురం కారాదు విషాదం
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు ఎక్కడ చూసినా పతంగుల సందడే కనిపిస్తుంది. వచ్చే శుక్రవారం నుంచి పాఠశాలలకు సంక్రాంతి సెలవులు రావడంతో నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో గాలి పటాలు ఎగురవేసే దృశ్యాలు కనిపిస్తాయి.
- పిల్లలపై పెద్దల పర్యవేక్షణ ఉండాలి
- మైదానాల్లో ఎగురవేస్తే సురక్షితం
బొంరాస్పేట, జనవరి 10 : సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు ఎక్కడ చూసినా పతంగుల సందడే కనిపిస్తుంది. వచ్చే శుక్రవారం నుంచి పాఠశాలలకు సంక్రాంతి సెలవులు రావడంతో నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో గాలి పటాలు ఎగురవేసే దృశ్యాలు కనిపిస్తాయి. ఆకాశ వీధిలో రంగు రంగుల పతంగులు కనువిందు చేస్తుంటాయి. పిల్లలంతా ఒకచోట చేరి ఉత్సాహంగా పతంగులను ఎగురవేస్తుంటారు. ఇదంతా ఒకవైపు ఉంటే పండుగ వేళ ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా వినోదం కాస్తా విషాదంగా మారే ప్రమాదం ఉంది.
ముఖ్యంగా విద్యుత్ తీగలకు చిక్కుకున్న పతంగులను తీయబోయి విద్యుదాఘాతానికి గురవుతుంటారు. ఎత్తయిన భవనాలపైకి ఎక్కి కిందపడుతుంటారు. గతంలో ఇలాంటి సంఘటనలు జరిగి చిన్న పిల్లలు ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు. ఇలాంటి ఘటనలు కుటుంబాలలో విషాదం నింపుతాయి. అందుకే గాలిపటాలు ఎగురవేసే సమయంలో పిల్లలపై పెద్దల పర్యవేక్షణ తప్పక ఉండాలి.
భవనాలపై వద్దు మైదానాలే మేలు..
- నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో పిల్లలు ఇళ్లపైన ఎక్కువగా పతంగులను ఎగురవేస్తుంటారు. పట్టణ ప్రాంతాలలో మైదానాలు దూరంగా ఉంటాయి కాబటి పిల్లలు భవనాలను ఎక్కి పతంగులు ఎగురవేస్తుంటారు. భవనాలకు పిట్ట గోడలు లేకపోవడం, ఉన్నా తక్కువ ఎత్తులో ఉండడంతో ఎగురవేసే ఆనందంలో ఇవేవి చూసుకోకుండా కిందపడే అవకాశం ఉంటుంది. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకుని పతంగులను ఎగురవేయాలి.
- రహదారులపై ఎగురవేస్తూ వాహ నాల కిందపడే ప్రమాదం ఉన్నది. రోడ్లు ఖాళీగా ఉన్నా సరే అక్కడ పతంగులను ఎగురవేయవద్దు.
- తెగిన గాలిపటం కోసం వెనుకా ముందు చూసుకోకుండా పరుగెత్త వద్దు. దీనివల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నది.పతంగులను ఆరు బయట, మైదాన ప్రాంతాల్లోనే ఎగురవేయాలి. పిట్ట గోడల ఎత్తు ఎక్కువగా ఉన్న భవనాలపై ఎగురవేయవచ్చు. ఆ పిల్లలను పెద్దలు ఓ కంట కనిపెడుతూ ఉండాలి.
- విద్యుత్ కాటేస్తుంది జాగ్రత్త
- విద్యుత్ స్తంభాలకు ఇరుక్కున్న, తెగిన మాంజాలు, పతంగులను చేతితో, ఇనుప చువ్వలతో లాగవద్దు. విద్యుదాఘాతానికి గురయ్యే అవకాశం ఉంది.
- విద్యుత్ తీగలపై పడిన దారాలు పట్టుకుని లాగొద్దు. ఇలా చేయడంతో విద్యుత్ సరఫరా జరుగుతున్న తీగలు ఒకదానికొకటి తాకి షార్ట్ సర్క్యూట్ అవుతుంది.
- పతంగులు ఎగురవేసే ముందు మెటాలిక్ దారాలను ఎలాంటి పరిస్థితుల్లో ఉపయోగించవద్దు. విద్యుత్ తీగలకు తగిలినప్పుడు షాక్ కొట్టే అవకాశం ఉంది. లైన్లు సైతం తెగిపడే ప్రమాదం ఉంది. విద్యుత్ స్తంభాలు, తీగలు, చెట్లకు గాలి పటాలు తగిలి చిక్కుకుంటే వాటిని తీయడానికి ప్రయత్నించరాదు. ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నది.
- పతంగి ఎగురవేయడానికి వినియోగించే నిషేధిత మాంజా ప్రమాదకరంగా మారుతుంది. ఎగురవేసే వారి చేతి వేళ్లు తెగుతుంటాయి. పైగా రహదారులపై వెళ్తున్న వారి మెడకు బిగుసుపోవడంతో గొంతు దగ్గర గాయాలయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి పతంగులకు నిషేధిత మాంజాను ఉపయోగించరాదు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మీకు ఫ్యాటీ లివర్ సమస్య ఉందా.. అయితే ఈ పండ్లు తప్పక తినాలి..!
భవాని మాతకు మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్రెడ్డి, గాదరి కిశోర్ ప్రత్యేక పూజలు
ACB Case | ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కీసర సీఐపై ఏసీబీ కేసు నమోదు
‘నీటి వనరుల సంరక్షణతో ప్రత్యామ్నాయ పంటల సాగు చేపట్టాలి’
POCSO | స్కూల్లో పరిచయమై పెళ్లి పేరుతో మోసం.. పాపకు జన్మనిచ్చిన బాలిక.. యువకుడిపై పోక్సో కేసు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

