బషీరాబాద్, ఫిబ్రవరి 16: మండలంలోని జీవన్గి కాగ్నానది ఒడ్డున కొలువైన మహాదేవ లింగేశ్వరాలయంలో శుక్రవారం నుంచి మూడు రోజులపాటు జాతర ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు సర్పంచ్ నవనీత, ఆలయ కమిటీ సభ్యు లు, గ్రామ పెద్దలు తెలిపారు. 17న నవగ్రహ పూజ, నవగ్రహహోమం, వెండి పల్లకీసేవ.. 18న రుద్రాభిషేకం, బిల్వార్చన, లింగోద్భవ సమయం వరకు శివ పురాణం, తెల్లవారు జామున 5 గంటలకు అగ్నిగుండం, 19న ఉదయం ఎడ్లబండ్ల పరు గు పందెం, 3.15 గంటలకు పార్వతీపరమేశ్వరుల కల్యాణం, రథోత్స వం, అన్నదాన కార్యక్ర మం, కుస్తీ పోటీలు, ప్రసాద వితరణ, అన్నదాన కార్యక్రమాలు ఉంటాయని వారు తెలిపారు.
ముస్తాబైన శివాలయాలు
మండలంలోని అన్ని గ్రామాల్లో ఉన్న శివాలయాలు మహాశివరాత్రికి ముస్తాబయ్యాయి. నవాంద్గీ సంగమేశ్వరాలయం, నీళ్లపల్లి ఏకాంబర రామలింగేశ్వరాలయంతోపాటు పలు ఆలయాల్లో ఏర్పాట్లు పూర్తైనట్లు ఆలయ నిర్వాహకులు , అర్చకులు తెలిపారు.
జాతర ఏర్పాట్ల పరిశీలన..
రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా మహాదేవ లింగేశ్వర జాతరలో కుస్తీ పోటీలు నిర్వహించడం ప్రత్యేకతగా చెప్పొచ్చు. ఈ పోటీల్లో పాల్గొనేందుకు కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ర్టాల నుంచి యువకులు అధికంగా తరలివస్తారు. దీంతో గురువారం తాండూరు రూరల్ సీఐ జీవన్గి గ్రామానికి వచ్చి గ్రామ పెద్దలతో కలిసి జాతర ఏర్పాట్లను పరిశీలించారు. కార్యక్రమంలో ఎస్సై విద్యాచరణ్రెడ్డి, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.