రంగారెడ్డి, ఫిబ్రవరి 23 (నమస్తే తెలంగాణ) : ఈసారైనా ఎల్ఆర్ఎస్ ప్రక్రియ సాఫీగా సాగి తమ ప్లాట్లను ప్రభుత్వం క్రమబద్ధీకరించాలని పలువురు ప్లాట్ల యజమానులు కోరుతున్నారు. గతంలో ప్లాట్ల రెగ్యులరైజేషన్ కోసం జిల్లాలో పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకున్నారు. వాటిలో 15 నుంచి 20 శాతం కూడా పరిష్కారానికి నోచుకోలేదు. గతంలో ప్రభుత్వం ప్లాట్ల రెగ్యులరైజేషన్ కోసం విధించిన షరతుల కారణంగా అది ముందుకు సాగలే దు. చాలీచాలని రెవెన్యూ సిబ్బంది, టీపీవోల కొరత, ఇరిగేషన్‌కు హైడ్రా దెబ్బవం టి ప్రభావంతో ప్లాట్ల క్రమబద్ధీకరణ ఎక్కడికక్కడ నిలిచిపోయింది. ఈసారైనా నిబంధనలు సడలించి లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీం (ఎల్ఆర్ఎస్) ప్రక్రియను వేగవంతం చేయాలని పలువురు కోరుతున్నారు. జిల్లాలో 13 మున్సిపాలిటీలు, 2 కార్పొరేషన్లు, 519 గ్రామ పంచాయతీలున్నాయి. వాటిలో 2,38,268 మంది తమ ప్లాట్ల క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు చేసుకోగా.. వాటి లో 50,000 కూడా పూర్తి కాలేదు.
జిల్లాలోని శివారు మున్సిపాలిటీల్లోని యజమానులు ప్లాట్ల క్రమబద్ధీకరణ కో సం ఏండ్లుగా ఎదురు చూస్తున్నారు. జిల్లాలో అత్యధికంగా 13 మున్సిపాలిటీలున్నాయి. ఇవి అన్ని హైదరాబాద్ నగ రం చుట్టే విస్తరించి ఉన్నాయి. దీంతో ఈ మున్సిపాలిటీల్లో పెద్ద ఎత్తున లేఅవుట్లు చేశారు. ఈ లేఅవుట్లలో ప్లాట్లు కొనుగోలు చేసిన వారికి ఎల్ఆర్ఎస్ లేకపోవడంతో బ్యాంకు రుణాలు రాక.. ఇండ్ల నిర్మాణా లు చేపట్టలేకపోతున్నారు.
ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు పెద్ద ఎత్తున క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకున్నా రు. అప్లికేషన్ల పరిశీలనకు ప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమిటీలో సిబ్బం ది కొరతతో ఆ ప్రక్రియ ముందుకు సాగలేదు. పెద్దఅంబర్‌పేట మున్సిపాలిటీ నుం చి 49,260 దరఖాస్తులు, తుర్కయాంజాల్ నుంచి 48,806, బడంగ్‌పేట నుం చి 45,582 దరఖాస్తులు వచ్చాయి. వాటిలో ఇప్పటివరకు 15 నుంచి 20 శాతం కూడా రెగ్యులరైజ్ కాలేదు. ఈసారైనా ఎల్ఆర్ఎస్ ప్రక్రియ సాఫీగా సాగి తమ ప్లాట్లను క్రమబద్ధీకరించాలని పలువురు కోరుతున్నారు.
జిల్లాలో ఎల్ఆర్ఎస్ ప్రక్రియ ప్రారంభమైన వెంటనే లేఅవుట్ల లో మిగిలిపోయిన ప్లాట్ల రెగ్యులరైజేషన్ కోసం వచ్చిన దరఖాస్తులు 2,38,268 ఉన్నాయి.
మున్సిపాలిటీ పేరు వచ్చిన దరఖాస్తులు
ఆదిబట్ల 17,619
పెద్దఅంబర్‌పేట 49,260
బండ్లగూడ జాగీర్ 7,892
శంషాబాద్ 10,031
ఇబ్రహీంపట్నం 6,197
కొత్తూరు 3,596
శంకర్పల్లి 4,780
ఆమనగల్లు 3,562
బడంగ్‌పేట 45,582
తుక్కుగూడ 2,440
జల్పల్లి 10,914
తుర్కయాంజాల్ 48,806
మణికొండ 2,591
నార్సింగి 3,356
మీర్‌పేట 3,412
షాద్‌నగర్ 14,996
అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి. తమ పార్టీ అధికారంలోకి రాగానే ప్లాట్లను ఉచితంగా క్రమబద్ధీకరిస్తామని ప్రకటించారు. దాని ప్రకారమే రేవంత్‌రెడ్డి సర్కార్ ఉచితంగా ఎల్ఆర్ఎస్ చేయాలి. జిల్లాలో అనేక మంది పేదలు అప్పులు చేసి ప్లాట్లను కొనుగోలు చేశారు. క్రమబద్ధీకరణ కోసం డబ్బులు వెచ్చించే స్థితిలో వారు లేదు.
-పాతూరి రాజేశ్‌గౌడ్