షాద్‌నగర్, ఏప్రిల్ 10 : వరంగల్ రజతోత్సవ సభతో బీఆర్ఎస్ సత్తా ఏమిటో చాటుదామని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. పలు ప్రాంతాల్లో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసులను బనాయిస్తున్నదని, ఆ కేసులకు ఎవరూ భయపడొద్దని, రానున్నది మన కేసీఆర్ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. గురువారం షాద్‌నగర్ పట్టణంలో బీఆర్ఎస్ రజతోత్సవ సన్నాహక సమావేశం మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆధ్వర్యంలో జరిగింది.
ఈ సందర్భంగా ఆయన వరంగల్ బహిరంగ సభ వాల్ పోస్టర్లను మాజీ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌తో కలిసి ఆవిష్కరించి, గోడలకు అం టించి మాట్లాడారు. నాటి ఉమ్మడి రాష్ట్రంలో పాలమూరు జిల్లా అంటేనే వలస జిల్లా అనే పేరు ఉండేదని, కానీ, కేసీఆర్ నాయకత్వంలో స్వరాష్ర్టాన్ని సాధించుకున్న అనంతరం మహబూబ్‌నగర్ జిల్లా ఏ స్థాయిలో అభివృద్ధి చెందిం దో మనకు కండ్ల ముందే కనిపిస్తున్నదని గుర్తు చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అలవి కాని హామీలు ఇచ్చి.. అన్ని వర్గాలను మోసం చేసి అధికారంలోకి వచ్చిందని.. పవర్లోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీల్లో ఒక్క దానిని కూడా సక్రమంగా అమలు చేయలేదని మండిపడ్డారు. రేవంత్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందిపడుతున్నారని.. మళ్లీ కేసీఆర్ పాలన కోసం ఎదురుచూస్తున్నారని పేర్కొన్నా రు. కేసీఆర్‌తోనే రైతులు లాభపడతారని.. సాగునీటి ప్రాజెక్టులు వస్తాయన్నారు.
ఈ నెల 27న హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు అన్ని గ్రామాల నుంచి బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు, రైతులు, అన్ని వర్గా ల వారు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ షాద్‌నగర్ పట్టణంలో బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభ వాల్ రైటింగ్ చేసిన అనంతరం మాట్లాడు తూ.. తెలంగాణ ప్రజల చిరకాల వాంఛను కేసీఆర్ నెరవేర్చి రాష్ర్టాన్ని సాధించి..అన్ని రంగాల్లో తెలంగాణను అగ్రగామిగా నిలిపారని కొనియాడారు.
కాంగ్రెస్ అధికారంలో ఉన్నా.. ప్రజలు మాత్రం కేసీఆర్‌ను మరువడంలేదన్నారు. ఆయనతోనే రాష్ర్టాభివృద్ధి సాధ్యమన్నారు. కార్యక్రమంలో మాజీ జడ్పీ వైస్ చైర్మన్ ఈటె గణేశ్, సహకార సంఘాల కార్పొరేషన్ మాజీ చైర్మన్ రాజావరప్రసాదవ్, మాజీ మున్సిపల్ చైర్మన్ నరేందర్, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు నటరాజన్, నాయకులు నారాయణరెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, యుగేందర్, వెంకట్రాంరెడ్డి, ప్రతాప్‌రెడ్డి, కిశోర్, నర్సింహ, చెట్ల నర్సింహ, శేఖర్, అంతయ్య, మర్రిపల్లి నర్సింహ, భిక్షపతి, సుధీర్, షబ్బీర్లాల, అశోక్, నవీన్, రమేశ్, సంతోష్, రామకృష్ణ, యాదగిరి, నరహరి, శ్రీకాంత్‌గౌడ్, శ్రీనివాసులు, రాజశేఖర్, సు శాంత్ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.