తాగారు..ఊదారు..
కొత్త సంవత్సరం వేడుకల్లో భారీగా మందుబాబులు పట్టుబడ్డారు. మరో పక్క సైబరాబాద్‌లో మద్యం మత్తులో ఒక కానిస్టేబుల్ బైక్ నడుపుతూ రోడ్డు ప్రమాదం చేసి ఓ వ్యక్తి మరణానికి కారకుడయ్యాడు.
- గ్రేటర్లో డీడీకి చిక్కిన 3 వేల మంది
- కౌన్సెలింగ్ కోసం పరుగులు తీసిన మందుబాబులు
- మద్యం మత్తులో వ్యక్తికి టక్కరిచ్చిన కానిస్టేబుల్, ఓ వ్యక్తి దుర్మరణం
- చల్లని బిర్యానీ, ఉడకని ముక్కలంటూ ఘర్షణ
సిటీబ్యూరో, జనవరి 1 (నమస్తే తెలంగాణ) : కొత్త సంవత్సరం వేడుకల్లో భారీగా మందుబాబులు పట్టుబడ్డారు. మరో పక్క సైబరాబాద్‌లో మద్యం మత్తులో ఒక కానిస్టేబుల్ బైక్ నడుపుతూ రోడ్డు ప్రమాదం చేసి ఓ వ్యక్తి మరణానికి కారకుడయ్యాడు. హైదరాబాద్‌లో హోటల్లో బిర్యానీలో ముక్కలు రాలేదని, చల్లగా ఉందంటూ ప్రశ్నించిన పాపానికి హోటల్లో పనిచేసే సిబ్బంది యజమాన్యంతో కలిసి కస్టమర్లను చితకబాదారు. వీటితోపాటు ట్రై కమిషనరేట్ల పరిధిలో అక్కడక్కడ చిన్నచిన్న గొడవలు, ప్రమాదాలు మినహా న్యూ ఇయర్ వేడుకలు ప్రశాంతంగా జరిగాయి.
న్యూ ఇయర్ వేడుకలకు భారీ ఎత్తున డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తామంటూ మూడు రోజుల ముందు నుంచే హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ ట్రై పోలీస్ కమిషనర్లు శ్రీనివాస్‌రెడ్డి, అవినాష్ మహంతి, సుధీర్‌బాబు హెచ్చరిస్తూ వచ్చారు. అయినా మందుబాబులు న్యూ ఇయర్ వేడుకల్లో మందులో మునిగి తేలి అడ్డంగా దొరికిపోయారు. ట్రై పోలీస్ కమిషనరేట్ల పరిధిలో 3 వేల డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. కేసులు నమోదైనవారు 1న ఉదయం హైదరాబాద్‌లోని గోషామహల్ ట్రాఫిక్ శిక్షణ కేంద్రానికి కౌన్సెలింగ్‌కు తరలివెళ్లారు.
అడుగడుగునా డ్రంక్ అండ్ డ్రైవ్
ట్రై పోలీస్ కమిషనరేట్ల పరిధిలో రోడ్డు ప్రమాదాలు జరుగకుండా కట్టడి చేసేందుకు పోలీసులు పటిష్ట చర్యలు తీసుకున్నారు. అయినా అక్కడక్కడ ప్రమాదాలు జరిగాయి. ప్రతి ట్రాఫిక్ ఠాణా పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ ఒకటి రెండు చోట్ల తప్పని సరిగా నిర్వహించేలా పోలీసులు చర్యలు తీసుకున్నారు. అయినా చాలా మంది మందుబాబులు మందు తాగి రోడ్లపై చిందులు వేస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. కూకట్‌పల్లిలో ఎస్ఆర్నగర్ ఠాణాలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న మల్లికార్జున్ మద్యం మత్తులో ద్విచక్రవాహనాన్ని నడుపుతూ కేఎల్ఎం బట్టల షాప్‌లో పనిచేసే దుర్గయ్య(58)ను ఢీకొట్టడంతో మృతి చెందాడు. స్థానికులు అతడిని పోలీసులకు అప్పగించారు.
మరో పక్క అబిడ్స్‌లో దూల్‌పేట్‌కు చెందిన సుమిత్‌సింగ్ మరో ఏడుగురితో కలిసి గ్రాండ్ హోటల్లో రాత్రి భోజనానికి వచ్చాడు. వివిధ వంటకాలను అర్డర్ చేశారు. అందులో మటన్ బిర్యానీ చల్లగా ఉందని.. సరిగ్గా ఉడకలేదంటూ వెయిటర్‌కు చెప్పారు. వెయిటర్ దానిని వేడి చేసి తిరిగి తెచ్చాడు. బిర్యానీ సరిగ్గా లేదని.. దీనికి తాము బిల్లు చెల్లించబోమంటూ దూల్పేట్ వాసులు చెప్పారు.
బిల్లు కౌంటర్ వద్దకు వచ్చిన తరువాత కూడా మటన్ బిర్యానీ బిల్లుపై వాగ్వాదం జరిగింది. దీంతో హోటల్లో పనిచేసే సర్వర్లు, ఇతర పనివాళ్లు దూల్పేట్ వాసులను చితకబాదారు. హోటల్ యజమానితో పాటు దాడికి పాల్పడిన వారిపై అబిడ్స్ పోలీసులు కేసు నమోదు చేసి 10 మందిని అదుపులోకి తీసుకున్నారు. దీనిపై స్థానిక గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించి హోటల్ యజమానిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కస్తాలలో సబ్ స్టేషన్ ముందు రైతుల నిరసన
విద్యుత్ వైరు తెగిపడి పాడి బర్రె మృతి
Crazy Kalyanam | ‘క్రేజీ కళ్యాణం’ రివ్యూ.. అనుపమ, తరుణ్ భాస్కర్ల సినిమా ఎలా ఉంది?
AP News | వైసీపీ మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు.. అధికారంలోకి రావడం ఖాయం, వడ్డీతో కలపి చెల్లిస్తాం
Share Market | లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్.. సెన్సెక్స్ 413 పాయింట్లు లాభం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

