తమ భూములను కాపాడుకునేందుకు న్యాయపోరాటం చేస్తే కాంగ్రెస్ సర్కార్ వక్రీకరించిందని రోటిబండ తండా గ్రామానికి చెందిన బాధితులు, కుటుంబీకులు ఆవేదన వ్యక్తం చేశారు. బెయిల్‌పై బయటకు వచ్చిన సందర్భంగా బీఆర్ఎస్ లీగల్ సెల్ నాయకులు నర్సింహానాయక్, బీఆర్ఎస్వీ సంగారెడ్డి కోఆర్డినేటర్ రాజేంద్రనాయక్, గిరిజన సంక్షేమ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు జైపాల్ నాయక్‌లు బాధిత రైతులను కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా బాధిత రైతులు మాట్లాడుతూ సొంత భూములను కాపాడుకునేందుకు పోరాడితే సర్కార్ జైలులో పెట్టడం సరికాదన్నారు.
రైతులను కాపాడాల్సిన ప్రభుత్వం సంఘవిద్రోహ శక్తులుగా చిత్రీకరించి థర్డ్ డిగ్రీ ప్రయోగించడం బాధగా ఉన్నదన్నారు. ఇంకా ఎన్ని బాధలనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని, భూములను మాత్రం ఇవ్వబోమని బాధిత రైతులు స్పష్టం చేశారు. రైతులకు అండగా బీఆర్ఎస్ పార్టీ ఉన్నదని, ఐక్యరాజ్య సమితి దృష్టికి సైతం తీసుకెళ్తానని మాజీ మంత్రి కేటీఆర్ చెప్పడం ఎంతో భరోసానిచ్చిందన్నారు. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి సహకారంతోనే తమకు న్యాయం జరిగిందన్నారు. రానున్నది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, రైతుల తరఫున పూర్తి మద్దతు ఉంటుందన్నారు. జైలులో ఉన్న హీర్యానాయక్‌కు గుండెపోటు వస్తే, పోలీసులు బేడీలు వేసి తీసుకెళ్తుంటే బోరున విలపించామన్నారు.