Labourers Protest | మాకు జీతాలు ఇవ్వడం లేదు.. రంగారెడ్డి జిల్లా దవాఖానలో కార్మికుల ఆందోళన
Labourers Protest | నెలలు గడుస్తున్నా వేతనాలు అందక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, కుటుంబాలను పోషించడం కష్టంగా మారిందని కొండాపూర్‌లోని రంగారెడ్డి జిల్లా ప్రభుత్వ దవాఖానలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నుంచి నిధులు విడుదలైనా కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో జీతాల చెల్లింపులో జాప్యం జరుగుతోందని ఆరోపించారు.
Labourers Protest | కొండాపూర్, జూలై 7: జీతాలు సకాలంలో చెల్లించడం లేదంటూ కొండాపూర్‌లోని రంగారెడ్డి జిల్లా ప్రభుత్వ దవాఖానలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు మంగళవారం ఆందోళనకు దిగారు. రోగుల సంరక్షణ, సెక్యూరిటీ, శానిటేషన్ విభాగాల్లో విధులు నిర్వహిస్తున్న కార్మికులు దవాఖాన ప్రాంగణంలో గంటపాటు నిరసన చేపట్టి తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
నెలలు గడుస్తున్నా వేతనాలు అందక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, కుటుంబాలను పోషించడం కష్టంగా మారిందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నుంచి నిధులు విడుదలైనా కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో జీతాల చెల్లింపులో జాప్యం జరుగుతోందని ఆరోపించారు. కాంట్రాక్టర్‌పై ఉన్నతాధికారులు వెంటనే చర్యలు తీసుకుని ప్రతి నెలా సకాలంలో వేతనాలు చెల్లించేలా చూడాలని కార్మికులు డిమాండ్ చేశారు.
అలాగే ప్రభుత్వం ప్రకటించిన రూ.26 వేల కనీస వేతనాన్ని తక్షణమే అమలు చేసి, కార్మికులకు న్యాయం చేయాలని వేడుకున్నారు. సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని కార్మికులు హెచ్చరించారు.
Read Also :
Elon Musk | ట్రిలియనీర్ హోదా కోల్పోయిన ఎలాన్ మస్క్.. 1.4 ట్రిలియన్ డాలర్స్ నుంచి 992-997 బిలియన్ డాలర్లకు సంపద..!
Congress | జూపల్లి VS సీఎం రేవంత్ .. మంత్రి కూరలో కరివేపాకు అంటూ మీడియాలో కథనాలు
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సారపాకలో ముమ్మరంగా ఓటరు నమోదు
AP News | ఏపీకి మరో తుపాను ముప్పు.. భారీ వర్షాలు కురుస్తాయన్న ఐఎండీ
AP News | ఎన్నికల వేళ చంద్రబాబు సర్కారు దుర్మార్గాలు చేస్తోంది : పేర్ని నాని
కూలీలు ఉపాధి పనులను సద్వినియోగం చేసుకోవాలి: జడ్పీ సీఈవో నాగలక్ష్మి
‘టీఎస్ యూటీఎఫ్ నల్లగొండ జిల్లా మహాసభలను విజయవంతం చేయండి’
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం అర్జున్ ముండా వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

