షాద్‌నగర్ మున్సిపల్ మాజీ చైర్మన్ కొందూటి నరేందర్ దంపతులు, వైస్ చైర్మన్ నటరాజ్‌ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘనంగా సన్మానించారు. ఇటీవల మున్సిపల్ పదవీకాలం ముగిసిన సందర్భంగా శుక్రవారం తెలంగాణ భవన్లో చైర్మన్లు, వైస్ చైర్మన్లను శాలువాలతో సన్మానించి జ్ఞాపికలను అందజేశారు.
ఇందులో భాగంగానే మాజీ చైర్మన్ నరేందర్, కౌన్సిలర్ మహేశ్వరి, వైస్ చైర్మన్ నటరాజ్‌ను మాజీ మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్సీ నవీన్‌కుమార్, కేశంపేట మాజీ ఎంపీపీ, బీఆర్ఎస్ యువనాయకుడు రవీందర్‌యాదవ్‌తో కలిసి సన్మానించారు. కార్యక్రమంలో షాద్‌నగర్ బీఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్, సత్యనారాయణ పాల్గొన్నారు. -షాద్‌నగర్ టౌన్, జనవరి 31