వయోవృద్ధులకు ఇంటివద్దే కొవిడ్ టీకాలు

సైదాబాద్, ఆగస్టు 5 : తెలంగాణ రాష్ట్రఆరోగ్యశాఖ, సీనియర్ సిటిజన్స్ సర్వీస్ ట్రస్ట్ సంస్థ సమన్వయంతో మొదటిసారిగా 70ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్స్‌కు ఇంటివద్దే కొవిడ్ వ్యాక్సిన్ కార్యక్రమాన్ని గురువారం ఐఎస్ సదన్ డివిజన్ పరిధిలోని సుబ్రహ్మణ్యంనగర్కాలనీలో నిర్వహించారు. మాదన్నపేట ప్రాథమిక ఆరోగ్యకేంద్రం అధికారి డాక్టర్ గీత పాల్గొని వ్యాక్సినేషన్ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కొవిడ్ వ్యాక్సిన్‌ను ప్రతి ఒక్కరూ తీసుకోవాలని సూచించారు. వయోవృద్దులకోసం ఇంటివద్దకే వచ్చి కోవిడ్ టీకాలు వేయటంపట్ల హార్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సుబ్రహ్మణ్యం కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులు ఓఎస్వీడీ ప్రసాద్, సాయిబాబా ఆలయ కమిటీ చైర్మన్ నెరేళ్ల ప్రసాదరావు, కార్యదర్శి శేషగిరిరావు, సభ్యులు వైఎస్ఆర్ మూర్తి, వైద్య సిబ్బంది సరిత తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

